మండలంలోని వడియంపేట గ్రామంలో ఇరువర్గాలకు చెందిన రౌడీషీటర్లుకు పోలీసులు
కౌన్సెలింగ్ ఇచ్చారు. రానున్న పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ముందుస్తు చర్యగా
ఎస్ఐ నారాయణరెడ్డి మండలంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఐదుగురు
రౌడీషీటర్లును గుర్తించారు. వారిని అనంతపురం డీఎస్పీ దయానందరెడ్డి ఎదుట హాజరుపరిచారు.గ్రామంలో అధిపత్యం కోసం ఇరువర్గాలు
ఘర్షణలు,బెదిరింపులు దిగితే కఠిన చర్యలు తీసుకుంటామని డీఎస్పీ
హెచ్చరించారు. గతంలో జరిగిన సంఘటనలు పునురావృత్తం కాకుండా చూడాలని మాజీ
సర్పంచ్ పీ శ్రీనివాసులుకు సూచించారు. ప్రస్తుతం 12 సంవత్సరాల అనంతరం
గ్రామంలోకి వచ్చిన రౌడీషీటర్ శ్రీరాములను తిరిగి గ్రామబహిస్కరణ చేయాలని
పోలీసులు నిర్ణయించినట్టు సమాచారం. ముందుస్తు జాగ్రత్తగా ఐదుగురు రౌడీ
షీటర్లు గంధం రవి, తలారి కాశీం, పరిశే నరసింహలు, పరిశే శ్రీనివాసులు, గంధం
శ్రీరాములును తహీసీల్దార్ నాగరాజు వద్ద 50 వేల పూచీకత్తుతో బైండోవర్
చేశారు.గ్రామాల వారీగా రౌడీషీటర్లుకు కౌన్సెలింగ్- ఎస్ఐ
త్వరలో గ్రామ పంచాయతీ, స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఎలాంటి సంఘటనల
జరగుకుండా ముందస్తు భాగంగా రౌడీషీటర్లు, ఫ్యాక్షన్ నేతలకు కౌన్సెలింగ్
ఇవ్వనున్నట్టు ఎస్ఐ నారాయణరెడ్డి తెలిపారు. గ్రామాల వారీగా తొలుత
రౌడీషీటర్లును గుర్తించి వారిని స్టేషన్‌కు పిలిపించి కౌన్సెలింగ్
ఇస్తామన్నారు. అనంతరం మండలంలోని ఫ్యాక్షన్ గ్రామల్లో ఉన్న ఇరు వర్గాల
నేతలకు కూడ దశలవారిగా కౌన్సెలింగ్ నిర్వహించి బైండోవర్ చేయనున్నట్లు ఆయన
తెలిపారు
No comments:
Post a Comment