క్రికెట్‌లో సచిన్ గొప్ప బ్యాట్స్‌మన్‌గా ఎదగడానికి అతడికి ఉన్న మానసిక
దృఢత్వమే కారణమని, అదే అతని గొప్పతనమని ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు
కెప్టెన్ క్లార్క్ అభిప్రాయపడ్డాడు. సిడ్నీ మైదానంతో ప్రత్యేక అనుబంధం ఉన్న
కారణంగా రెండో టెస్ట్‌లో సచిన్ తన వందవ సెంచరీ చే సే అవకాశం ఉందన్నాడు.
ఆసీస్ బౌలర్లు జాగ్రత్తగా లేకుంటే తగిన మూల్యం చెల్లించుకోవాల్సి ఉందని
సిడ్నీ మార్నింగ్ హెరాల్డ్‌కు రాసిన వ్యాసంలో హెచ్చరించాడు. ప్రపంచ
క్రికెట్‌లోని మేటి బౌలర్లను సచిన్ చీల్చి చెండాడాడని, కోర్ట్నీ వాల్ష్,
వసీం అక్రం, కర్ట్‌లీ ఆంబ్రోస్, వకార్ యూనిస్, మెక్‌గ్రాత్, షేన్‌వార్న్
వంటి బౌలర్లను కూడా అద్భుతంగా ఎదుర్కొన్నాడని ఆధునిక బ్రాడ్‌మన్ గురించి
క్లార్క్ ప్రశంసల వర్షం కురిపించాడు.
|
No comments:
Post a Comment