Monday, 2 January 2012

డీఎస్సీ నోటిఫికేషన్‌కు సీఎం ఆమోదం

రాష్ట్రంలో భారీగా టీచర్ పోస్టుల భర్తీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇప్పటికే ఖాళీగా 11 వేల పోస్టులతోపాటు మరో తొమ్మిదివేల పోస్టులకు సీఎం ఆమోదం తెలిపారు. జనవరి 15 తేది తర్వాత 20 వేల పోస్టులతో డీఎస్సీ నోటిఫికేషన్‌ను ప్రభుత్వం జారీ చేయనుంది. 11 వేల 139 ఖాళీలను ఇప్పటికే గుర్తించారు. వాటిలో 7 వేలకు పైగా ఎస్‌జీటీ పోస్టులు, 2 వేలకు పైగా స్కూల్ అసిస్టెంట్ పోస్టులు ఉన్నట్టు అధికారులు గుర్తించారు. ఈ పోస్టులకు తోడుగా మరో 9 వేల 659 పోస్టులను ఒకేసారి భర్తీ చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది.
 డీఎస్సీ ద్వారా ఉపాధ్యాయుల భర్తీకి సీఎం ఆమోదం తెలిపిన నేపథ్యంలో రాలయసీమ జిల్లాల వారీగా ఉన్న టీచర్ పోస్టుల ఖాళీల వివరాలు ఇలా ఉన్నాయి.
చిత్తూరు- 528, కడప- 97, అనంతరపురం- 399, కర్నూలు- 625

No comments:

Post a Comment