తిరుపతిలో
బీఈడీ విద్యార్థులు ఆందోళనకు దిగారు. థానిక శాసనసభ్యుడు చిరంజీవిని బిఇడి విద్యార్థులు సోమవారం అడ్డుకున్నారు.
తమకు న్యాయం చేయాలని వారు డిమాండ్ చేశారు. జివో నెంబర్ 3ను తొలగింప చేయాలని
విజ్ఞప్తి చేశారు. చిరంజీవిని అడ్డుకున్న బిఇడి విద్యార్థులకు వైయస్సార్
కాంగ్రెసు పార్టీ మద్దతు పలికింది. అనంతరం ఆయన మాట్లాడుతూ తెలుగుదేశం
పార్టీ అధినేత నారాచంద్రబాబు నాయుడు నీచ రాజకీయాలకు పాల్పడుతున్నారని
విమర్శించారు. చిరంజీవి నగరంలోని పలు అభివృద్ధి కార్యక్రమాల్లో
పాల్గొనేందుకు ఉదయం తిరుపతి వచ్చారు. అంతకుముందు హైదరాబాద్ నుండి తిరుపతి
విమానాశ్రయంలో దిగిన ఆయన మీడియాతో మాట్లాడారు. మంత్రి పదవులు మూడు
ఇవ్వలేమని చెప్పి అధిష్టానం సర్దుకోమని చెప్పిందని, తెలంగాణకు మరో విధంగా
న్యాయం చేస్తామని చెప్పిందని అందువల్లే రెండు మంత్రి పదవులు ఒప్పుకున్నట్లు
చెప్పారు.. తమ పాలిట శాపంగా పరిణమించిన ఏడో నెంబర్ జీవోను రద్దు
చేయాలని విద్యార్థులు డిమాండ్ చేశారు. అదే సమయంలో బయటకు వచ్చిన చిరంజీవి
ఇరకాటంలో పడ్డారు. అభ్యర్థులకు స్పష్టమైన హామీ ఇవ్వకుండానే ఆయన
వెళ్లిపోయారు.
No comments:
Post a Comment