చిరంజీవి-బాలకృష్ణ మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది.విశాఖ జిల్లా పర్యటనలో ఉన్న బాలకృష్ణ చిరంజీవిపై ధ్వజమెత్తారు. తనను ఒకరు
బాలుడన్నారని, తమను ఒకవైపే చూశారని, తమ రెండో రూపం వారికి తెలియదని
బాలకృష్ణ హెచ్చరించారు. అధికారం కోసం పార్టీని అమ్ముకోలేదని, సీఎం
కుర్చీనే వారి జీవిత లక్ష్యమని బాలకృష్ణ అన్నారు. పార్టీని అమ్ముకున్న
వారికి నాన్నగారితో పోలికా అంటూ ఆయన ప్రశ్నించారు. జిల్లాలో రెండోరోజైన
సోమవారం పర్యటిస్తున్న బాలయ్య పెదవాల్తేరులో ఎన్టీఆర్ విగ్రహాన్ని
ఆవిష్కరించిన అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ
పార్టీని అమ్ముకున్న వాళ్లా మమ్మల్ని విమర్శించేది అంటూ ధ్వజమెత్తారు.
నాన్నగారి ఆశయాలే తమను రాజకీయాలకి ఆహ్వానించాయని బాలకృష్ణ పేర్కొన్నారు.
ప్రజాధనాన్ని కుటుంబానికి దోచిపెట్టిన వారి విగ్రహాలు చూడాల్సివస్తోందని,
స్వప్రయోజనాల కోసం కొందరు విగ్రహాలను రాజకీయం చేస్తున్నారని బాలకృష్ణ
వ్యాఖ్యానించారు. ఎన్టీఆర్ కాలిగోటికి ఎవరూ సరిపోరని అన్నారు. తండ్రి
ఆశయాలను కొనసాగిస్తామని, టీడీపీకి పూర్వ వైభవం తీసుకురావడానికి కృషి
చేస్తానని ఆయన స్పష్టం చేశారు.బాలకృష్ణ వ్యాఖ్యలపై స్సందించను: చిరంజీవి

బాలకృష్ణ ఎక్కడ నుంచి పోటీ చేసినా గొప్పేమీ లేదని, ఆ విషయాన్ని తాను లైట్ తీసుకుంటానని చిరంజీవి తిరుపతిలో అన్నారు.సినీహీరో బాలకృష్ణ వ్యాఖ్యలపై తాను స్పందించనని స్థానిక ఎమ్మెల్యే చిరంజీవి అన్నారు. చిత్తశుద్ధితో సేవచేసినంతకాలం ఎవరెన్ని వ్యాఖ్యలు చేసినా ప్రజలు పట్టించుకోరన్నారు. తనపై బాలకృష్ణ వ్యాఖ్యలను కూడా ప్రజలు పట్టించుకోరని ఆయన చెప్పారు. సామాజిక న్యాయం గురించి మాట్లాడే అర్హత చంద్రబాబు నాయుడుకు లేదన్నారు. చంద్రబాబు పాలనలో బిసిలకు అన్యాయం జరిగిందన్నారు. కాంగ్రెస్ లో విభేదాలు ఏమీలేవని చెప్పారు. విభేదాలు అన్ని మీడియా కథనాలేనన్నారు.
నీచ రాజకీయాలకు బలి కావద్దు...లక్ష్మీపార్వతి

నీచ రాజకీయాలకు బలిపశువు కావద్దని సినీహీరో బాలకృష్ణకు ఎన్టీఆర్ సతీమణి లక్ష్మీపార్వతి సలహా ఇచ్చారు. ఈ రోజు ఆమె ఇక్కడ విలేకరులతో మాట్లాడారు. చంద్రబాబు నీచుడు, నయవంచకుడు అటువంటి వ్యక్తితో బాలకృష్ణ చేతులు కలపడం బాధాకరం అన్నారు. మీ తండ్రికి వెన్నుపోటు పొడిచిన బాబుతో చేయి కలపడం భావ్యంకాదని బాలకృష్ణని ఉద్దేశించి ఆమె అన్నారు. తండ్రిని చంపిన వ్యక్తితో చేతులు కలుపుతావా? అని ప్రశ్నించారు. మీ తండ్రికి చేసిన నష్టాన్ని ఎవరైనా పూడ్చలుగుతారా? అని కూడా ఆమె అడిగారు. వేషాలు మార్చే చంద్రబాబుని ఎవరూ నమ్మరని చెప్పారు. కేసుల నుంచి బయటపడేందుకు చంద్రబాబు తెలుగు జాతి గౌరవాన్ని ఢిల్లీలో తాకట్టుపెట్టారని విమర్శించారు. నీచుడు, అవినీతిపరుడైన చంద్రబాబుతో చేతులు కలపవద్దని, చక్రవర్తి కుమారుడిలాగా తలెత్తుకు బతకమని ఆమె బాలకృష్ణకు సలహా ఇచ్చారు.
No comments:
Post a Comment