2012లో సచిన్ వందో సెంచరీ చేస్తాడా...?
2012వ సంవత్సరం క్రీడాభిమానులకు కొత్త అనుభూతిస్తుందా? లేదా అనేది ఇప్పడు ఓ
పెద్ద మిస్టరీగా మారింది. ఇందుకు కారణాలు రెండు. ఒకటి క్రికెట్ దేవుడు
సచిన్ టెండూల్కర్ తన వందో సెంచురీని ఈ సంవత్సరంలో పూర్తి చేస్తాడని
అభిమానులు నమ్ముతుండగా, 2012వ సంవత్సరం ఒలంపిక్స్‌కు ఆతిధ్య సంవత్సరం.
2012లో జరగనున్న ఒలంపిక్ గేమ్స్‌కి లండన్ ఆతిధ్యమివ్వనున్న సంగతి
తెలిసిందే. ఐతే ఈ సంవత్సరం ఈ రెండు విషయాలు ఖచ్చితంగా జరుగుతాయని
విశ్లేషకులు చెబుతున్నారు. మొదటి టెస్టుని కొల్పోయిన టీమిండియాకు
రెండవ టెస్టు జరగనున్న సిడ్నీ స్టేడియం ఒకింత కలసి వచ్చే అంశంగా
భావిస్తున్నారు. సిడ్నీ గ్రౌండ్‌లో సచిన్ రికార్డు చాలా మెరుగ్గానే ఉంది.
1992 నుంచి ఇప్పటి వరకు సిడ్నీలో జరిగిన నాలుగు టెస్ట్‌ల్లో సచిన్
టెండూల్కర్ పాల్గొని, తన సత్తా చాటాడు. 148 నాటౌట్(1992), 241
నాటౌట్(2004), 154 నాటౌట్ (2008). దీంతో పాటు 221 పరుగుల సరాసరితో సచిన్
పేరిట సిడ్నీ రికార్డు ఉంది. ఇదే స్ఫూర్తితో సిడ్నీ పిచ్‌పై సచిన్
టెండూల్కర్ సెంచరీ చేయడం ఖాయమని అభిమానులు భావిస్తున్నారు. ఇంకా ఈ గ్రౌండ్
విశేషం ఏమిటంటే వందో టెస్ట్ మ్యాచ్‌కు ఆతిథ్యమిస్తోంది. ఇది
మాత్రమే కాకుండా సచిన్ వందో సెంచురీ సాధించాలే వారిలో ఆస్టేలియా ప్రధాని
జూలియా గిలార్డ్ కూడా చేరారు. ఈ సందర్బంలో ఆమె ఆదివారం సిడ్నీలో ఏర్పాటు
చేసిన తేనీటి విందులో మాట్లాడుతూ ప్రస్తుత టెస్ట్ సీరీస్‌లో సచిన్
టెండూల్కర్ తన నూరవ అంత ర్జాతీయ శతకం సాధించాలనే ఆకాంక్షను గిలార్డ్
వ్యక్తం చేశారు. ఇప్పటి వరకు 99 అంతర్జాతీయ సెంచరీలు స్కోర్ చేసిన సచిన్
టెండూల్కర్‌ను గిలార్డ్ చూస్తూ, ‘మా క్రికెట్ జట్టును ఆస్ట్రేలియన్లు
గట్టిగా సమర్థిస్తున్నా ఈ సీరీస్‌లో ఏదో ఒక సమయంలో (టెండూల్కర్ నుంచి)
ఎంతో ప్రత్యే కమైన 100 స్కోర్ కోసం వారు ఎదురుచూస్తున్నారని నా భావన’ అని
చెప్పారు.
No comments:
Post a Comment