‘మీరు పరీక్షకు హాజరైతే చాలు. మిగతా సంగతి మేము చూసుకుంటాం. మాకు తెలిసిన
ఒక మంత్రి ద్వారా పోస్టు వచ్చేలా చూస్తాం. రూ.7 లక్షలిస్తే పోస్టు
గ్యారంటీ’ అంటూ వీఆర్వో, వీఆర్‌ఏ ఉద్యోగార్థులను దళారులు
మభ్యపెడుతున్నారు. ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసినప్పటి నుంచే కాంగ్రెస్ పార్టీకి చెందిన
కొందరు దళారులు రంగంలోకి దిగారు. మరోవైపు ప్రభుత్వం ఈ పరీక్షను అవకతవకలకు
తావులేకుండా నిర్వహిస్తామని చెబుతోంది. రాత పరీక్షలో మెరిట్ ఆధారంగా
అభ్యర్థుల ఎంపిక జరుగుతుంది. మూల్యాంకనం సైతం అందుబాటులో ఉన్న సాంకేతిక
విధానం ద్వారా నిర్వహిస్తారు. ఈ విషయం తెలియని కొందరు అమాయక నిరుద్యోగులు
దళారుల మాయలో పడి మోసపోతున్నారు. కొందరైతే అప్పు చేసి మరీ దళారుల చేతుల్లో
పెడుతున్నారు. అధికార పార్టీకి చెందిన కొందరు నాయకులు దళారుల అవతారమెత్తి నిరుద్యోగుల
జీవితాలతో ఆడుకుంటున్నారు. జిల్లాలో వీఆర్వో, వీఆర్‌ఏ పోస్టులకు విపరీతమైన
పోటీ నెలకొంది. ఒక్కో పోస్టుకు సగటున 440 మంది పోటీ పడుతున్నారు. ఈ నెల 30న
జిల్లా కేంద్రంలో రాత పరీక్ష జరగనుంది. ఆరోజు ఉదయం వీఆర్వో, మధ్యాహ్నం
వీఆర్‌ఏ అభ్యర్థులకు పరీక్ష ఉంటుంది. ప్రశ్నపత్రాన్ని రూపొందించే బాధ్యత
జేఎన్‌టీయూకు అప్పగించారు. జిల్లాలో పర్యవేక్షణలో రాత
పరీక్ష నిర్వహిస్తారు.
No comments:
Post a Comment