Thursday, 22 December 2011

రైల్వే రిజర్వేషన్ సిస్టమ్‌లో మార్పు

రైల్వేశాఖలో రిజర్వేషన్ సిస్టం మారనున్నది. సికింద్రాబాద్‌లో చేపట్టే అభివృద్ధి పనుల వల్ల అర్ధరాత్రి నుంచి రైల్వేసేవలకు బ్రేక్ పడింది. బుధవారం ఉదయం 7 గంటల వరకు అంతర్జాలంలో ప్రయాణికులు రిజర్వేషన్ చేసుకునే సదుపా యం నిలిచిపోయింది. రాత్రి పది నుంచే ఈ పరిస్థితి ఉంటుందని రైల్వే అధికారులు అంటున్నారు. అంతేగాకుండా రైల్వే రాకపోకల వేళలు, విచారణ సేవలు, పీఎన్‌ఆర్ స్టేటస్ అందుబాటులో ఉం డవు. ప్యాసింజర్ రిజర్వేషన్ సిస్టమ్ నిలిపివేయడంతో ఈ పరిస్థితులు ఏర్పడ్డాయి. కొన్ని రైళ్లకు సంబంధించి చార్ట్‌లను మంగళవారం రాత్రి తీసుకున్నారు. రీఫండ్ కూడా ఇవ్వడానికి వీలుకాదని రైల్వే వర్గాలు చెబుతున్నాయి. ముఖ్య రైల్వేస్టేషన్‌లలో కేవలం యూటీఎస్ (అన్‌రిజర్వ్‌డ్ టికెట్ సిస్టమ్) మాత్రమే పని చేస్తోంది.
పోర్ట్ సదరన్ రైల్వేకి అప్పగింత
దక్షిణమధ్య రైల్వే పీఆర్‌ఎస్ సిస్టమ్‌ను సదరన్‌రైల్వేకి అప్పగిస్తున్నారు. ఈ మేరకు అభివృద్ధి పనులు సౌత్‌సెంట్రల్ రైల్వే చేపడుతోంది. అం దులోనే భాగంగా అర్ధరాత్రి నుంచి ఉదయం వరకు రిజర్వేషన్ సిస్టమ్‌ను షడౌన్ చేస్తున్నారు. ఇప్పటి వరకు ఎస్సీరైల్వే పీఆర్‌ఎస్ సిస్టమ్‌లో లాగిన్ అయ్యి ఎస్‌సీఆర్‌ఎఫ్‌ఈ1తో రిజర్వేషన్ ప్రక్రియను కొనసాగించేవారు. ఇకపై లాగిన్ ఎంఏఎస్‌ఎఫ్‌ఈ1తో ఈ ప్రక్రియను చేపట్టాల్సి వస్తోంది. అంటే చెన్నైతో రిజర్వేషన్ సిస్టమ్ అనుసంధానం చేస్తారు. ఎస్సీరైల్వేపోర్ట్ నుంచి సదరన్ రైల్వేపోర్ట్‌లో విలీనం చేయనున్నారు.

No comments:

Post a Comment