Thursday, 22 December 2011

 టి-20 ప్రపంచకప్ అర్హత పోటీలకు 16 జట్లు

వచ్చే ఏడాది సెప్టెంబర్‌లో జరగనున్న ఐసీసీ టి-20 ప్రపంచకప్ పోటీలకు అర్హత సాధించేందుకు అమెరికా, ఉగాండా సహా మొత్తం 16 జట్లు పోటీపడనున్నాయి. ప్రపంచ కప్‌లో చివరి రెండు స్థానాలు దక్కించుకునేందుకు ఈ జట్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాయి. మార్చి 13 నుంచి 24 వరకు జరిగే ఈ అర్హత పోటీలను దుబాయ్, షార్జాల్లోని ఐదు వేదికల్లో నిర్వహించనున్నారు. జట్ల వివరాలు : గ్రూప్ ఎ: అఫ్ఘానిస్తాన్, నెదర్లాండ్స్, కెనడా, పపూవా న్యూ గినియా, హాంకాంగ్, బెర్ముడా, డెన్మార్క్, నేపాల్. గ్రూప్ బి: ఐర్లాండ్, కెన్యా, స్కాట్లాండ్, నమీబియా, ఉగాండా, ఒమన్, ఇటలీ, అమెరికా.

No comments:

Post a Comment