Thursday, 22 December 2011

తిరుపతి క్షేత్రంలో అందాల పోటీలు నిషేధించాలి...బిజెవైఎం డిమాండ్

తిరుపతి ఒక అధ్యాత్మిక క్షేత్రమని అలాంటి పుణ్యక్షేత్రంలో ఒక ప్రైవేటు సంస్థ అందాల పోటీలు నిర్వహించడానికి తెగపడడాన్ని ప్రతి ఒక్కరు ఖండించి అందాల పోటీలను నిషేధించాలని బిజెవైఎం డిమాండ్ చేశారు. తిరుపతి పవిత్రత కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైనా ఉందన్నారు. అలాంటి ప్రదేశంలో ప్రైవేటు సంస్థ జనవరిలో మిస్ తిరుపతి, మిసెస్ తిరుపతి పోటీలను నిర్వహిస్తామని బహిరంగ ప్రకటన చేసే సాహసం చేసిందన్నారు. భారతీయ మహిళలను వ్యాపార అభివృద్ధికి ఒక పావుగా వాడుకోవడాన్ని భారతీయ జనతా యువమోర్చా సహించబోదన్నారు. మహిళలను ఆకర్షించుకోవడానికి బహుమతులను ఎరగా వేస్తున్నారని, ఇది మరింత దారుణమన్నారు. ఇది భారతీయ సంస్కృతి కాదన్నారు. ఈ పోటీలలో ఏమాత్రం ఆశ్లీలత కనిపించినా భారతీయ జనతా యువమోర్చా అడ్డుకుంటుందని  ఇలాంటి పోటీలు నిర్వహించి యువకులను తప్పుదారి పట్టిస్తున్నారన్నారు. ఇలాంటి పోటీలతో జరిగే లాభాలకన్నా నష్టాలే ఎక్కువని ఆవేదన వ్యక్తం చేశారు. ఇదిలా వుండగా అందాల పోటీలు నిర్వహించాలని ఆ సంస్థ ప్రకటించిన నేపధ్యంలో ఎన్‌ఎఫ్‌ఎఫ్ ఆధ్వర్యంలో జ్యోతిరావ్ పూలే విగ్రహం ఎదుట ఆ సంస్థ బ్యానర్‌ను, దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. పాశ్చాత్య విష సంస్కృతిని వ్యాపార, లాభార్జనకోసం తిరుపతిలో ప్రవేశపెట్టాలని చూస్తే తాము చూస్తూ ఊరుకోబోన్నారు.

No comments:

Post a Comment