కాణిపాకం విచ్చేసే భక్తులకు జనవరి ఫస్ట్‌కు విస్తృత ఏర్పాట్లు
జనవరి ఒకటవ తేదీ కాణిపాకం విచ్చేసే భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని
ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్టు డీఆర్వో శేషయ్య తెలిపారు.
సాయంత్రం ఈవో కార్యాలయంలో జనవరి ఫస్ట్ ఏర్పాట్లపై అధికారుల సమీక్ష సమావేశం
జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జనవరి ఫస్టున లక్ష మందికి పైగా
భక్తులు వచ్చే అవకాశం ఉందని, రద్దీకి అనుగుణంగా ఏర్పాట్లు చేయాలని అధికారుల
ను ఆదేశించారు. అధికారులు, సిబ్బంది సమన్వయంతో పని చేయాలన్నారు. వీఐపీ
భక్తుల వల్ల సామాన్య భక్తులు ఇబ్బందులు ఎదుర్కొనకుండా చర్యలు తీసుకోవాలని
సూచించారు. భక్తులందరికీ శీఘ్రదర్శనం కల్పించాలన్నారు. ఎలాంటి అవాంఛనీయ
సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు భద్రత కల్పించాలన్నారు. భక్తుల
సౌకర్యార్థం ప్రత్యేక బస్సులు నడపాలని ఆర్టీసీ అధికారులకు సూచించారు. ఆలయ
పరిసరాలన్నీ పరిశుభ్రంగా ఉండేలా ఎప్పటి కప్పుడు శానిటేషన్ పనులను
పరిశీలించాలని పంచాయతీ కార్యదర్శిని ఆదేశిం చారు. రోడ్లకు తాత్కాలిక
మరమ్మతులు చేయాలని ఆర్‌అండ్‌బీ అధికారులకు ఆయన సూచించారు. ఈ సమావేశానికి
ఎంపీడీవో పార్వతమ్మ, డీపీఆర్వో గైర్హాజర్ కావడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
ట్రాన్స్‌కో ఏడీ మోహన్‌రాజ్ మాట్లాడు తూ విద్యుత్ సరఫరాలో అంతరాయం
ఏర్పడకుండా 160 కేవీ ట్రాన్స్‌ఫార్మర్‌ను అందుబాటులో ఉంచుతామని తెలిపా రు.
అనంతరం మండల వైద్యాధికారిణి షర్మిష్టారెడ్డి మాట్లాడుతూ ప్రత్యేక
వైద్యశిబిరం నిర్వహించనున్నట్టు తెలిపారు. ఈ సమావేశంలో ఆర్‌డీవో
సుబ్రమణ్యేశ్వరరెడ్డి, డీఎస్పీ శిల్పవల్లి, సీఐ శ్రీకాంత్, ఆలయ అసిస్టెంట్
కమిషనర్ గురుప్రసాద్, తహసీల్దార్ రంగస్వామి తదితరు లు పాల్గొన్నారు.
No comments:
Post a Comment