ప్రపంచస్థాయికి తిరుపతి జూ అభివృద్ధి
ఆసియా ఖండంలో విస్తీర్ణత దృష్ట్యా రికార్డు సాధిం చిన తిరుపతి జంతు
ప్రదర్శన శాలను ప్రపంచస్థాయికి అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు
తీసుకుంటుం దని రాష్ట్ర భూగర్భ గనుల శాఖ మంత్రి గల్లా అరుణకుమారి
తెలిపారు. కర్ణాటక రాష్ట్రం మైసూరు జూ నుంచి తీసుకువచ్చి న మూడు అడవి
దున్నల ఎన్‌క్లోజర్లను ఆమె జెండా ఊపి ప్రారంభిం చారు. అనంతరం
మంత్రి మాట్లాడుతూ తిరుపతికి వస్తున్న యాత్రికులు, సందర్శకులను దృష్టిలో
ఉంచుకుని తొలిసారిగా ఇక్కడి జూలో అడవి దున్నలను ఏర్పాటు చేసినట్టు
చెప్పారు. ఒక మగ, రెండు ఆడజాతి దున్నలను ఇక్కడికి తీసుకువచ్చి అందుకు
బదులుగా మైసూరు జూకు 4 ఎలుగుబంట్లను ఇక్కడి నుంచి తరలించి నట్టు తెలిపారు.
ఈ అడవి దున్నలకు తిరుపతి జూ వాతావరణం అనువుగా ఉంటుందన్నారు. వీటి
జీవితకాలం 20-25 సంవత్సరాలు ఉంటుందన్నారు. వీటి సంరక్షణకు పూర్తిస్థాయిలో
చర్యలు తీసుకున్నట్టు మంత్రి పేర్కొన్నారు.
No comments:
Post a Comment