
నగరంలోని ముఖ్య కూడళ్లలో ప్రజలు ఇబ్బందులకు గురి కాకుండా రూ. 1.50 కోట్లతో
ఫుట్ ఓవర్ బ్రిడ్జి(పాదచారుల వంతెన)లు నిర్మిస్తున్నట్లు రాష్ట్ర చిన్న
నీటి పారుదల శాఖ మంత్రి టీజీ వెంకటేష్ వెల్లడించారు. శనివారం స్థానిక కొత్త
బస్టాండ్, రాజ్‌విహార్, కలెక్టరేట్ వద్ద పాదచారుల వంతెనల నిర్మాణానికి
మంత్రి శిలాఫలకాలను ఆవిష్కరించారు. నగరానికి కొత్త శోభను తెచ్చేందుకు
పాదచారుల వంతెనను నిర్మిస్తున్నామన్నారు. ప్రకాష్ ఆర్ట్స్ సహకారంతో వ్యాపార
దృక్పథం లాభాపేక్ష లేకుండా కొత్త బస్టాండ్, రాజ్‌విహార్, కలెక్టరేట్ వద్ద
ఒక్కోటి రూ. 50 లక్షలు వెచ్చించి నిర్మిస్తామన్నారు. మొదటి దశలో వంతెనలు పూర్తయిన తర్వాత ఎక్స్‌లేటర్, లిఫ్ట్ సౌకర్యాలు రూ. కోటితో ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు
No comments:
Post a Comment