పవన్ తో ఓ సినిమా కోసం దిల్ రాజు వేట
పవన్ కళ్యాణ్ ఎస్ జె సూర్య కాంబినేషన్ లో వచ్చిన చిత్రం ‘ఖుషి’. ఈ చిత్రం 2001 ఏప్రిల్ 27న విడుదలై సంచలన విజయం సాధించింది. ఇదే చిత్రాన్ని డిస్ట్రిబ్యూట్ చేసి అప్పటి నుంచి పవన్ తో ఓ సినిమా చేసే ఛాన్స్ కోసం దిల్ రాజు దాదాపు పదకొండేళ్ళుగా ఎదురు చూస్తున్నాడట. అయితే ఆయన కల త్వరలో నెరవేరనుందని తెలుస్తోంది. ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ చిత్రంలో పవన్ నటిస్తాడని ప్రచారం జరిగింది. కానీ ఆ ప్లేస్ లో మహేష్ నటిస్తుండటంతో దిల్ రాజు పవన్ హీరోగా ఓ భారీ బడ్జెట్ చిత్రాన్ని నిర్మించడానికి ప్లాన్ చేస్తున్నాడని విశ్వసనీయ వర్గాల సమాచారం. గత కొన్ని నెలలుగా పవన్ చుట్టూ తిరుగుతున్న దిల్ రాజు చాలా సిట్టింగ్స్ జరిపారని ఈ మధ్యనే పవన్ ఓ స్క్రీప్ట్ ని ఫైనలైజ్ చేశాడని ఇండస్ట్రీ వర్గాల కథనం. పవన్ వెంటపడి మరీ సాధించుకున్న దిల్ రాజుకి పవన్ తో సినిమా చేయాలనే పట్టుదలకు హాట్సాఫ్ అంటున్నారు ఇండస్ట్రీ వర్గాలు
No comments:
Post a Comment