Wednesday, 9 November 2011

పవన్ దగ్గరకి రేణు తిరిగి వచ్చేసింది




పవన్ కళ్యాణ్, రేణు దేశాయ్ మధ్య తలెత్తిన అభిప్రాయబేధాలు వారు విడిపోవడానికి కారణమయ్యాయని, చాలా కాలంగా రేణు దేశాయ్ పూణెలో తన పుట్టింట్లోనే ఉంటోందని, అప్పుడప్పుడు తనయుడు అఖీరానందన్ ఇక్కడికి రావడం తప్ప పవన్ తన భార్యని కలుసుకోలేదని పుకార్లు షికారు చేస్తున్న సంగతి తెలిసిందే. ఓ ప్రముఖ ఆంగ్ల పత్రిక కథనం ప్రకారం ఇప్పుడు వారిద్దరి మధ్య వచ్చిన సమస్యలకి పరిష్కారం దక్కింది. పవన్ దగ్గరకి రేణు తిరిగి వచ్చేసింది.
తానూ పవన్ కళ్యాణ్ వైవాహిక బంధం నుంచి విడిపోలేదని నటి ,డిజైనేర్ రేణు దేశాయ్ పేర్కొన్నారు .తామిద్దరం విడిపోయినట్టు వస్తోన్న వార్తలన్నీ కేవలం పుకార్లే అని ఒక ఆంగ్ల పత్రిక కు ఇచ్చిన ఇంటర్వ్యూ లో రేణు స్పష్టం చేసారు. తమ కుటుంబాన్ని పూణే కి మార్చినప్పటినుంచి ఈ విధమైన పుకార్లు వ్యాపించాయని ఆమె చెప్పారు.ఈ అర్ధం లేని పుకార్లు తనను ,పవన్ ను ఎంతగానో బాధ పెట్టాయని ఆవేదన వ్యక్తం చేసారు .ఈ పుకార్ల ప్రభావం తమ పిల్లల పై పడుతుందేమో అని భయం గా వుందని చెప్పారు.తాము 11 ఏళ్ళనుంచి పరస్పరం ప్రేమించు కుంటున్నామని భవిష్యత్ లోను అలాగే ఉంటామని రేణు అన్నారు 

No comments:

Post a Comment