Wednesday, 9 November 2011

తిరుమలలో సిగరెట్‌ ప్యాకెట్‌ పక్కన పెట్టుకుని ప్రెస్‌మీట్‌ లో ఎమ్మెల్యే

తిరుమలలో కాంగ్రెస్‌ ఎమ్మెల్యే వీరశివారెడ్డి నిబంధనలు అతిక్రమించారు.తిరుమలలో ఉదయం శ్రీవారిని దర్శించుకున్న వీరశివారెడ్డి ఆ తర్వాత ప్రెస్‌మీట్‌ ఏర్పాటు చేశారు.తిరుమలలో సిగరెట్‌ నిషేధం ఉందని తెలిసి కూడా సిగరెట్‌ ప్యాకెట్‌ పక్కన పెట్టుకుని ప్రెస్‌మీట్‌ నిర్వహించారు.ఎమ్మెల్యే తీరుపట్ల పలువురు భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.పదిమందికి ఆదర్శంగా నిలవాల్సిన ప్రజాప్రతినిధే ఇలా వ్యవహరిస్తే సామాన్య జనం పరిస్థితి ఏంటని ప్రశ్నిస్తున్నారు... ప్రెస్‌ మీట్‌లో వీరశివారెడ్డి వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత జగన్‌పై విరుచుకుపడ్డారు.జగన్‌ ఓ మాఫియా కింగ్‌లా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు

No comments:

Post a Comment