ఇకపై మల్లన్న క్షేత్రంతో పాటు సమీప ఆలయాలకు కొత్త శోభ సంతరించుకోనుంది. దీంతో సమీప పుణ్యక్షేత్రాల దర్శనభాగ్యం కూడా భక్తులకు సులువు కానుంది. దేశంలోనే తిరుపతికి ఉన్నంత ప్రాచుర్యం ఇకపై కర్నూలుకూ దక్కబోతోంది. దీంతో తమ జిల్లాకు మహర్దశ పట్టబోతోందంటూ అక్కడి వాసులు కోటి ఆశలతో ఉన్నారు క్షేత్రపరిధిలో సాలిడ్ వేస్టేజ్ మెనేజ్‌మెంట్, నీటిసరఫరా, అంతర్గత డ్రైనేజీ, అంతర్గత రహదారులు ఏర్పాటవుతాయి. వ్యాపార సముదాయ భవనాలు వెలుస్తాయి. సాంస్కృతి కార్యక్రమాలకు పెద్దపీటవేసి ఆలయ ఆధ్వర్యంలో పెద్ద ఆడిటోరియం ఏర్పాటవుతుంది. ఉద్యానవనాల రూపకల్పన, సిబ్బంది నివాసగృహాలు, భక్తుల వసతి సముదాయలను పటిష్ఠం చేస్తారు. దీని ద్వారా ఏటా శ్రీశైల ఆర్థిక లావాదేవీలు రూ. 100 కోట్లనుంచి రెట్టింపయ్యే అవకాశాలున్నాయి. ప్రస్తుతం ఆలయాధ్వర్యంలోని 250 కాటేజీలు రెండుమూడింతలయ్యే అవకాశాలున్నాయి. ఇప్పుడున్న 334 వ్యాపార దుకాణాలు మూడింతలయ్యే అవకాశాలున్నాయి. తలనీలాల ఆదాయం గణనీయంగా పెరిగే అవకాశముంది.శ్రీశైలం దేవస్థానానికి స్వయం ప్రతిపత్తి వస్తే కర్నూలుకు మహర్దశ వస్తుంది. మహానంది, ఓంకారేశ్వరం, నవనందులు, నాలుగు ముఖద్వార క్షేత్రాలు, సంగమేశ్వరం తదితర ఆలయాలను కలుపుతూ శ్రీశైలానికి ప్రత్యేక హోదా చేకూరుతుంది. ప్రత్యేక ప్యాకేజీతో యాత్ర వసతి అందుబాటులోకి వస్తుంది. ఆలయ ఆదాయం గణనీయంగా పెరుగుతుంది. హోదా తీరే మారిపోతుంది. ఇప్పటిదాకా పాలకవర్గం కనుసన్నల్లో నిర్వహించే ఆలయం ఐఏఎస్ అధికారి ఆధ్వర్యంలో నడుస్తుంది
Friday, 25 November 2011
శ్రీశైలం ఇక తిరుమల తరహాలో హోదా దక్కబోతోంది!

Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment