డీఎస్సీ-98లో అర్హత సాధించి ఉపాధ్యాయ ఉద్యోగానికి ఎంపిక కాని అభ్యర్థులకు ఊరట లభించింది. ఆయా అభ్యర్థుల్లో మెరిట్ ఉన్న వారికి సెకండరీ గ్రేడ్ టీచర్ (ఎస్‌జీటీ) ఉద్యోగాలు ఇవ్వాలంటూ హైకోర్టు తీర్పు ఇచ్చింది. డీఎస్సీ-98కి సంబంధించి రెండు రకాల ఎంపిక జాబితాల ప్రకారం ఖాళీలకు లోబడి ఎస్‌జీటీ ఉద్యోగాలు ఇచ్చేందుకు వీలుగా ప్రభుత్వం వేర్వేరు ఉత్తర్వులు జారీ చేసింది. కానీ 5 మార్కులు తగ్గిస్తూ ఎంపిక చేసే జీవో 17 జిల్లాల్లోనే అమలైందని, మిగిలిన 6 జిల్లాల్లో సెలెక్టెడ్ అభ్యర్థుల్లో మెరిట్ ఉన్న వారికి అన్యాయం జరిగిందని పేర్కొంటూ కొందరు న్యాయస్థానాలను ఆశ్రయించారు. అటు ప్రభుత్వం, ఇటు అభ్యర్థులు రిట్ పిటిషన్లు దాఖలు చేశారు. ఖమ్మం, కరీంనగర్, వరంగల్, నల్గొండ, కడప, అనంతపురం జిల్లాల్లోని క్వాలిఫైడ్స్ వివాదం దశాబ్దకాలంగా నానుతూనే ఉంది. జస్టిస్ గోడ రఘురాం, జస్టిస్ జి.క్రిష్ణమోహన్‌రెడ్డిలతో కూడిన బెంచ్ ఎట్టకేలకు క్వాలిఫైడ్ టీచర్లకు ఒకింత ఊరట కలిగేలా తీర్పు ఇచ్చింది. ఈ విషయమై పాఠశాల విద్యా కమిషనర్ ఎన్.శివశంకర్‌ను వివరణ కోరగా.. ఇంకా తీర్పు కాపీ తమకు అందలేదని చెప్పారు
No comments:
Post a Comment