చెన్నై, గుంటూరు జోనల్ ఆర్మీ రిక్రూట్‌మెంట్ ఆధ్వర్యంలో అనంతపురంలోని ఆర్ట్స్ కళాశాల ఆవరణలో డిసెంబర్ 1 నుంచి 7వ తేదీ వరకు ఆర్మీ రిక్రూట్‌మెంట్ ర్యాలీ నిర్వహించనున్నట్లు యువజన సంక్షేమ శాఖ అధికారి వెంకటేష్ నాయక్ తెలిపారు. ఈ మేరకు గురువారం ఓ ప్రకటన విడుదల చేశారు. అనంతపురం, కర్నూలు, గుంటూరు, ప్రకాశం, పొట్టి శ్రీరాములు, వైఎస్‌ఆర్, చిత్తూరు జిల్లాల అభ్యర్థులకు సోల్జర్ టెక్నికల్, నర్సింగ్ అసిస్టెంట్, సోల్జర్ జనరల్ డ్యూటీ, ట్రేడ్స్‌మన్, సోల్జర్ క్లర్క్, కీపర్ కేటగిరీల వారీగా ర్యాలీ కార్యక్రమాలు ఉంటాయన్నారు. ఈ సందర్భంగా ధ్రువీకరణ పత్రాల నకలు, దేహధారుడ్య, శారీరక కొలతల పరీక్షలు జిల్లాల వారీగా జరుగుతాయన్నారు. 21 ఏళ్లలోపు వివాహం చేసుకున్న అభ్యర్థులు అనర్హులన్నారు. ప్రతి అభ్యర్థి టెన్త్, ఇంటర్, డిగ్రీ మార్కుల జాబితా, అభ్యర్థి కాండాక్ట్ సరిఫికెట్, టీసీ, క్రీడల్లో ప్రావీణ్యం కలిగిన వారు సంబంధిత నకలు ధ్రువీకరణ పత్రాలతో పాటు 12 పాస్‌పోర్ట్ సైజ్ ఫొటోలను తీసుకురావాలన్నారు. ఉద్యోగాలు ఇప్పిస్తామని ఎవరైనా చెబితే నమ్మొద్దన్నారు.ఆర్మీ రిక్రూట్‌మెంట్ ర్యాలీని విజయవంత చేయండి
No comments:
Post a Comment