36 రోజులుగా ట్రిపుల్ ఐటీ బోధకులు సమ్మె
విద్యార్థులపైన, అధ్యాపక వర్గంపైన ఈ ప్రభుత్వానికి ఎంత ప్రేమో ట్రిపుల్ ఐటీ బోధకుల దుస్థితిని చూసి తెలుసుకోవచ్చు. తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ సుమారు 36 రోజులుగా ట్రిపుల్ ఐటీ బోధకులు, హెచ్‌ఆర్టీలు చేస్తున్న సమ్మె విషయంలో సర్కారు ఏమాత్రం స్పందించడం లేదు. దీంతో విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతోంది. 20 రోజుల పాటు ఆర్.కె.వ్యాలీ ట్రిపుల్ ఐటీ వద్ద, ఆ తరువాత 16 రోజులుగా జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ ఎదుట వీరు రిలే దీక్షలు చేస్తున్నారు. మెంటర్లు (బోధకులు), హోం రూం ట్యూటర్లు(హెచ్‌ఆర్టీలు), హౌస్ కీపర్లు సమ్మెకు దిగడంతో మొదటి రెండు సంవత్సరాలు చదువుతున్న విద్యార్థులకు తరగతులు సాగడం లేదు. సమ్మె ముగిసే వరకు విద్యా సంస్థకు సెలవులు ప్రకటించారు. గ్రామీణ విద్యార్థులకు సాంకేతిక విద్యను అందించాలనే మహోన్నత ఆశయంతో 2008లో అప్పటి ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి రాష్ట్రంలో మూడు ట్రిపుల్ ఐటీలను ఏర్పాటు చేయించారుట్రిపుల్ ఐటీలలో విద్యార్థులకు సహాయకులుగా ఉన్న హోం రూం ట్యూటర్(హెచ్‌ఆర్టీ)ల పరిస్థితి దయనీయంగా ఉంది. రాష్ట్రంలో నూతనంగా ప్రవేశపెట్టిన పీజీ డిప్లమో ఇన్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కోర్సు చదివిన వారిని హెచ్‌ఆర్టీలుగా నియమించారు. వారికి నెలకురూ.10 వేల వంతున చెల్లిస్తున్నారు. వారు ఈ కోర్సు పూర్తి చేయడానికి దాదాపు రూ.1.5 లక్షల వరకు ఖర్చయింది. వారికి శిక్షణ ఇచ్చిన సంస్థ ఆ మొత్తాన్ని బ్యాంకు ద్వారా రుణం రూపంలో ఇచ్చింది. ఉద్యోగాలలో నియమితులైన తరువాత వారి వేతనంలో నెలకు రూ.4 వేల చొప్పున రుణం కింద మినహాయించుకుని, రూ.6 వేల వంతున చెల్లిస్తున్నారు. ఆర్.కె.వ్యాలీ ఐటీలో 80 మంది హెచ్‌ఆర్టీలు పని చేస్తున్నారు.
No comments:
Post a Comment