Monday, 21 November 2011

నేనూ చిరంజీవి అభిమానినే:మంత్రి గల్లా అరుణకుమారి

కాంగ్రెస్‌పార్టీ వారిని ఆదరిస్తున్నట్లుగా ప్రజారాజ్యంపార్టీని ఆదరిస్తానని మంత్రి గల్లా అరుణకుమారి అన్నారు.చిత్తూరు జిల్లాలో పిఆర్‌పి విలీన సభలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాజకీయంలో ఎవరు మిత్రులు, ఎవరు శత్రువులు అనేది శాశ్వతం కాదన్నారు.బండ్లు ఓడలవుతాయి, ఓడలు బండ్లవుతాయన్నారు. మేము అంతా మెగాస్టార్ చిరంజీవి అభిమానులమన్నారు. మా కుంటుంతో ఎంతో సన్నిహితంగా ఉంటారన్నారు. మా మధ్య ఇప్పటివరకు విమర్శలు లేవన్నారు. రాజకీయంగాలో ఉండే కక్షలు మెగాస్టార్‌తో లేవని అందరితో కలగలుపుగా ఉంటూ కలసిమెలసి పోతారన్నారు. ప్రతిపక్షాలు ముందుకు రాకున్నా చిరంజీవి స్పీకర్‌ను ఆయన సీటు వద్దకు తీసుకెళ్లినప్పుడు ఆయన హుందాతనం తెలిసిందన్నారు. కాంగ్రెస్ పార్టీలోని నాయకులను కార్యకర్తలను ఆదరిస్తున్నట్లుగానే పిఆర్‌పి వారిని ఆదరిస్తామన్నారు. వారిని పార్టీలోనికి ఆహ్వానిస్తూ కండువాలను కప్పారు. సైకం జయచంద్రారెడ్డి, హరిప్రసాద్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీలో ప్రజలకు చేస్తున్న అభివృద్ధి, ప్రజాకర్షక పథకాలను మమ్మల్ని, మా నాయకుడ్ని ఎంతో ఆకట్టుకున్నాయన్నారు. దీంతో తాము విలీనం అవుతన్నామన్నారు. కాంగ్రెస్ పార్టీ అభివృద్ధికి కృషి చేస్తామన్నారు.

No comments:

Post a Comment