Monday, 21 November 2011

జై రాయలసీమ సినిమా తీయాలి

 రాయలసీమ వాసులు కర్నూలు రాజధానిగా ఉన్న సమయంలో విశాలాంధ్ర కొరకు త్యాగం చేసి తెలుగు ప్రజల అభ్యున్నతి కోసం ఎన్నో త్యాగాలకు వారసులైన రాయలసీమ త్యాగ నిరతిపై జై రాయలసీమ చిత్రాన్ని సినీ నిర్మాతలు తీయాలని రాయలసీమ ఐక్య వేదిక అధ్యక్షులు పిబివి సుబ్బయ్య కోరారు. ఆదివారం స్ధానిక రవీంద్ర ఇంగ్లీషు మీడియం పాఠశాలలో సీమ ఐక్య వేదిక సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జై రాయలసీమ చిత్ర నిర్మాణం కోసం తాము సినిమా నిర్మాతలను సంప్రదించాలని, తమ సభ్యులతో కలసి చలన చిత్ర మండలి మాజీ అధ్యక్షులు, నిర్మాత బీవీ రెడ్డిని త్వరలో కలుస్తామని అన్నారు. ఐక్య వేదిక కార్యదర్శి విక్టర్ ఇమ్మానియేలు మాట్లాడుతూ రాయలసీమ ఫ్యాక్షన్ గురించి, కత్తులు కటారులు చూపడం భావ్యం కాదన్నారు. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి వంటి వీరగాధలు, పోతులూరి వీరబ్రహ్మేంద్ర ఆధ్యాత్మికతను ప్రధాన భూమికగా చూపాలని అన్నారు. మంచి హృదయంతో కర్నూలు ప్రజలు సమైక్యవాదానికి ప్రతీకగా నిలిచిన కర్నూలు త్యాగ నిరతిని చూపించాలని కోరారు. విద్యార్ధి సంఘాలు, ఐక్య కార్యాచరణ సంఘాలు, రాజకీయవాదులు, మేధావి వర్గాలు వీటిపై స్పందించి తగిన రీతిలో ముందుకు వచ్చి మన త్యాగ నిరతిని సినిమా ద్వారా, సాహితీ కార్యక్రమాల ద్వారా ప్రజలకు చాటాలని ఆయన పిలుపునిచ్చారు

No comments:

Post a Comment