నయనతార కు హాట్సాప్:ప్రభుదేవ
బాలయ్య రాముడి పాత్రలో, నయనతార సీత పాత్రలో నటించిన శ్రీరామ రాజ్యం సినిమా గురువారం ప్రపంచ వ్యాప్తంగా విడుదలై మంచి హిట్ టాక్ వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమాతో సీతగా నటించిన నయనతార తన ప్రియుడు, కాబోయే భర్త ప్రభుదేవతో కలిసి సినిమా వీక్షించింది. ఈ సినిమాలో నయన అభియనం చూసి ముగ్ధుడైపోయాడు ప్రభుదేవా. నయన నటనకు హాట్సాప్, ఆమె సినిమా షూటింగ్ జరిగినంత కాలం చాలా పవిత్రంగా జీవనం గడిపింది, అప్పుడు మరీ ఇంత అవసరమా? అని భావించాను, కానీ సినిమా పట్ల ఆమె అంకిత భావం మంచి ఫలితం ఇచ్చినందుకు సంతోషంగా ఉందని తన సన్నిహితుల వద్ద అన్నట్లు సమాచారం. "నయనతార మా 'శ్రీరామరాజ్యం' షూటింగ్‌లో పాల్గొన్నన్ని రోజులూ మహాసాధ్విగానే ప్రవర్తించింది. ప్రతిరోజూ ఉదయం గుడికెళ్ళిగానీ సెట్‌లో అడుగుపెట్టేది కాదు. శాకాహారమే తీసుకుంది. ఆమె కృషి ఫలితం తప్పకుండా స్క్రీన్‌పై కనిపిస్తుంది'' అని నిర్మాత యలమంచిలి సాయిబాబు 'శ్రీరామరాజ్యం' విడుదలకు ముందు చెప్పిన విషయాలు గుర్తు తెచ్చుకుని తెగ పొంగి పోయాడట ప్రభుదేవ. నాకు కాబోయే జీవిత భాగస్వామి మంచి పేరు తెచ్చుకోవడం ఆనందం ఉంది, సినిమాలోనే కాదు...ఆమె నిజంగా పవిత్రురాలే అంటూ ఆనంద పడిపోతున్నాడట
No comments:
Post a Comment