Friday, 18 November 2011

పర్యావరణ పరిరక్షణకు ఓ యువకుడు తనవంతు కృషి

పర్యావరణ పరిరక్షణకు ఓ యువకుడు తనవంతు కృషి చేస్తున్నాడు. ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించాలంటూ గోడలపై రాస్తూ ప్రచారం చేపట్టాడు.ప్లాస్టిక్‌ను నిషేధించాలంటూ అతను చేపట్టిన ప్రచారానికి ఇప్పుడు పలువురు తోడయ్యారు. చిత్తూరు జిల్లాలో ఒకే ఒక్కడుగా సైకిల్‌పై తిరుగుతూ గోడరాతలతో ప్రజలను చైతన్య పరుస్తున్నాడు. ఆత్మవిశ్వాసంతో సైకిల్‌పై వెళుతున్న ఇతని పేరు మురళి. డిగ్రీ వరకు చదవుకున్న ఇతను ప్రైవేట్ స్కూల్‌లో టీచర్‌గా పనిచేస్తూ ప్రకృతిపై ప్రేమను పెంచుకున్నాడు. ఆధునిక పోకడలతో అడవులను నరుకుతూ పర్యావరణానికి చేస్తున్న కీడుపై ప్రజలకు అవగాహనకల్పించాలన్న సంకల్పం బాగా వంట బట్టించుకున్నాడు. అందుకు గోడలపై రాతలనే ప్రచారంగా ఎంచుకున్నాడు. ప్రకృతిని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిదంటూ జన జాగృతం చేస్తున్నాడు. తనకొచ్చిన జీతంలోనే కొంత వెచ్చిస్తూ గోడలపై సందేశాత్మక రాతలను రాస్తున్నాడు.మురళి కృషిని ఇప్పుడు ప్రతి ఒక్కరూ అభినందిస్తున్నారు. కొందరు అతనికి తోడుగా తమవంతుగా చేయూతను ఇస్తున్నారు

No comments:

Post a Comment