Saturday, 19 November 2011

సినిమాలలో నటించగలను, ప్రజా జీవితంలో నటించలేను :ఎమ్మెల్యే జయసుధ

సినిమాలలో నటించగలను గాని ప్రజా జీవితంలో నటించలేనని ఎమ్మెల్యే జయసుధ శనివారంనాడు స్పష్టం చేశారు. ఇన్నాళ్లూ జగన్‌కు మద్దతుగా నిలిచి శుక్రవారంనాడు బహిరంగంగానే కిరణ్ సర్కార్‌కు జయసుధ మద్దతు ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రతి రోజూ ప్రభుత్వాన్ని తిడుతూ నియోజకవర్గంలో అభివృద్ధి పనులు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేయలేనని ఆమె వ్యాఖ్యానించారు. అందుకే తాను సినిమాలలో నటించగలను కాని బయట నటించలేనని ఆమె అన్నారు. ఈ రెండేళ్లూ రాజకీయంలో ఇమడలేక మానసికంగా చాలా ఇబ్బంది పడ్డానని, ప్రజలకు సంబంధించినంతవరకూ ఎన్నో పనులు జరగవలసి ఉందని, తన నియోజక ప్రజల శ్రేయస్సుకోసమే కిరణ్ సర్కార్‌కు మద్దతు పలికినట్టు ఆమె వెల్లడించారు

No comments:

Post a Comment