వైయస్సా పార్టీ శానససభ్యులు తిరిగి వెనక్కి వస్తారు:జెసి దివాకర్ రెడ్డి
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిని కాంగ్రెసు సీనియర్ నేత, శాసనసభ్యుడు జెసి దివాకర్ రెడ్డి పోట్లగిత్తగా అభివర్ణించారు. జగన్ వెంట వెళ్లినవారు పోట్ల గిత్తలేనని ఆయన శుక్రవారం మీడియా ప్రతినిధులతో అన్నారు. కాంగ్రెసు, జగన్ నాయకత్వాలను రుచి చూసిన తమ పార్టీ శాసనసభ్యులు మరింత రాణిస్తారని ఆయన అన్నారు.అన్నిరకాలుగా అండదండలున్నవారు మరింత పోట్ల గిత్తల్లా వారు మారిపోతున్నారని ఆయన అన్నారు. పోట్ల గిత్తల్లా వెళ్లినవారిని ఎద్దుల్లా మార్చి తిరిగి తమ కాంగ్రెసు పార్టీలోకి పంపిస్తున్నారని, సంతోషమేనని ఆయన అన్నారు. ఎద్దులుగా మారిన తర్వాత వారు మరింతగా రాణిస్తారని ఆయన అన్నారు. జగన్ వెంట వెళ్లనవారు వయ్ససులో ఉన్నవారు, పోట్ల గిత్తల్లాంటివారని ఆయన అన్నారు. కాంగ్రెసు నుంచి వెళ్లినవారు తిరిగి రాక తప్పదని ఆయన అన్నారు. వైయస్ జగన్ వెంట వెళ్లిన తమ కాంగ్రెసు పార్టీ శానససభ్యులు తిరిగి వెనక్కి వస్తారనే వార్తలపై ఆయన ఆ విధంగా వ్యాఖ్యానించారు. దాదాపు డజను మంది శానససభ్యులు జగన్‌ను వీడి కాంగ్రెసులోకి రావడానికి సిద్ధపడినట్లు వార్తలు వస్తున్న విషయం తెలిసిందే
No comments:
Post a Comment