సామాజిక సేవలో.... ఎన్‌సీసీ
సామాజిక సేవలో.... ఎన్‌సీసీ కేడెట్లకు కేవలం కవాతు, ఫైరింగ్ లాంటి శిక్షణ ఇవ్వడమే గాక సామాజిక సేవలో ఎన్‌సీసీ కేడెట్లు ముందుండే విధంగా కూడా శిక్షణ ఇస్తారు. అనేక సందర్భాలలో వరద లు, భారీ వర్షాలకు అతలాకుతలమైన ప్రాంతాల్లో నిస్వార్థంగా సేవలు అం దించి ఎంతో మందిని సురక్షిత ప్రాం తాలకు చేర్చిన ఘన చరిత్ర ఎన్‌సీసీ కేడెట్లకు ఉంది. ప్రజల్లో కాన్సర్, ఎయిడ్స్, డెంగ్యూ లాంటి ప్రాణాంతక వ్యాధులపై అవగాహన కలిగించేందు కు ర్యాలీ నిర్వహించి మారుమూల ప్రాంతీయుల్లో చైతన్యం తీసుకొస్తూ ప్రజలను రుగ్మతల నుంచి దూరం చే సే ప్రయత్నం చేస్తుంటారు. ప్రాథమిక చికిత్సపై ఎన్‌సీసీ కేడెట్లకు పూర్తి అవ గాహన ఉన్నందున ప్రమాదం ఉన్న వారికి ముందుగా ప్రధమ చికిత్స చేస్తారు.ప్రత్యేక అవకాశాలు రాష్ట్ర ప్రభుత్వం ఎన్‌సీసీలో చేరి 'సి' సర్టిఫికెట్ సాధించిన విద్యార్థులకు ఉన్నత చదువులకు ప్రత్యేక అవకాశాలు కల్పి స్తోంది. ఇంజనీరింగ్ కళాశాలల్లో ఒక శాతం రిజర్వేషన్ ఉంటుంది. అంటే ఏటా ఏడేనిమిది వందల మంది ఇంజనీరింగ్ సీట్లు, 0.25 శాతం మెడిసిన్ సీట్లు పొందేందుకు ఎన్‌సీసీ కేడెట్ల రిజర్వేషన్ ఉంది. ఎంబీఏ, ఎన్‌సీఏ, పోస్టు గ్రాడ్యుయేషన్, ఎల్ఎ ల్‌బీ, డైట్, బీఎడ్ కళాశాలల్లో ఒక శా తం ఎన్‌సీసీ కెడెట్లకు ప్రత్యేక రిజర్వేషన్ ఉండడం విశేషం.ఉద్యోగాలు ఎన్‌సీసీ 'సి' సర్టిఫికెట్ పొంది డిగ్రీ పూర్తి చేసిన విద్యార్థులకు ఆర్మీలో ఇం డియన్ మిలిటరీ అకాడమీ (ఐఎంఏ) డెహడూన్‌లో 64 పోస్టులు, ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీ (ఓటీఏ) చెన్న య్‌లో 100 పోస్టులు రిజర్వ్ చేస్తారు. నావీలో 6 పోస్టులు రిజర్వ్ చేసి ఉం టారు. అంతే కాక 2 నుంచి 10 శాతం పోస్టులను ఎన్‌సీసీ 'సి' సర్టిఫికెట్ వారి కోసం బీఎస్ఎఫ్, సీఆర్‌పీఎఫ్, సీఐఎస్ఎఫ్, కోస్టుగార్డ్, ఐటీబీపీల్లో రిజర్వ్ చేస్తారు.
No comments:
Post a Comment