రాష్ట్ర వ్యాప్తంగా ప్రకటించిన కరువు మండలాల జాబితాలో జిల్లాను పరిగణించకుండా, వరుస కరువులతో అల్లాడుతున్న "అనంత''కు వేయికోట్లిచ్చి ప్రత్యేక ప్యాకేజీతో జిల్లాను ఆదుకోవాలని సీపీఐ రాష్ట్ర రైతు సంఘ అధ్యక్షులు కే.రామక్రిష్ణ డిమాండ్ చేశారు. వరుస కరువులతో అల్లాడుతున్న అనంత ప్రజలను ఆదుకోడానికి శాశ్వత కరువు సహాయక చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. విద్యార్థులకు అన్ని రంగాల ఫీజుల మాఫీ చేసి, ఉపకారవేతనాలివ్వాలన్నారు. బ్యాంకుల్లోని వ్యవసాయ రుణాలన్నింటినీ మాఫీ చేయాలన్నారు. సాగు, తాగునీరు అందించడానికి ప్రత్యేక ప్రణాళిక రూపొందించాలని కోరారు. వర్షపాతానికి అనుగుణంగా పంటలు సాగు చేసేందుకు నిపుణులు, శాస్త్రవేత్తలు రైతులతో అవగాహన సదస్సులు నిర్వహించాలని సూచించారు. రైతులు కరువుబారిన పడకుండా సూక్ష్మ సేద్య పరికరాలన్నింటినీ ఉచితంగా అందివ్వాలని డిమాండ్ చేశారు. రైతుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ డిసెంబర్ 8న జిల్లా బంద్‌కు పిలుపునిస్తున్నామన్నారు. ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ చేపడుతున్న జిల్లా బంద్‌లో రైతులు, విద్యార్థులు, మహిళలు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.
No comments:
Post a Comment