ఓటరు జాబితాలో కొత్తవారి పేర్లను నమోదు చేయాలని తహసీల్దార్ దొరస్వామి బూత్‌లెవల్ ఆఫీసర్లకు ఆదేశించారు. స్థానిక కార్యాలయం లో విలేఖరులతో మాట్లాడుతూ ఈ నెల చివరిదాకా ఓటరు నమోదు కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు తహసీల్దార్ వెల్లడించారు. 18ఏళ్లు నిండిన యువతి, యువకులు ఓటుహక్కుకో సం దరఖాస్తుచేసుకోవాల్సిందిగా సూ చించారు. అలాగే ఓటరు కార్డులో పేరు మార్పుకోసం ఒకరు దరఖాస్తు చేసుకున్నారని పేర్కొన్నారు. వీఆర్వోలు, పంచాయతీ కార్యదర్శులు, అంగన్‌వాడీ నిర్వాహకులు పకడ్బందీగా ఓటరు నమోదు కార్యక్రమాన్ని చేపట్టాలన్నారు. ఎలాంటి సందేహాలు ఉన్న కార్యాలయంలో రెవెన్యూ అధికారులను సంప్రదించి నివృత్తి చేసుకోవాలన్నారు
No comments:
Post a Comment