శ్రీకృష్ణదేవరాయల పంచశతాబ్ది ఉత్సవాలు ఘనంగా జరుపుకున్న అనంతపురం జిల్లాలో రాయల సంపద శిథిలమవుతోంది. రాజగోపురాలు నెర్రెలతో వెక్కిరిస్తున్నాయి. ధ్వజస్తంభాలు నేలకొరిగేందుకు సిద్ధంగా ఉన్నాయి. ఎక్కడ చూసినా గుప్త నిధుల కోసం తవ్విన గుంతలు, ధ్వంసమైన విగ్రహాలే దర్శనమిస్తున్నాయి. పురావస్తుశాఖ అధికారుల నిర్లక్ష్యం వల్ల చారిత్రక జ్ఞాపకాలు చెదిరిపోయే పరిస్థితి కనిపిస్తోంది. అనంతపురం జిల్లాలో ఆలయాల దుస్థితిపై భక్తుల్లో ఆందోళన పెరుగుతోంది. ఇక్కడి ప్రముఖ దేవాలయాల్లో రాజగోపురాలు, ధ్వజస్తంభాల పరిస్థితిని పరిశీలిస్తే...

* తాడిపత్రిలో చింతల వెంకటరమణస్వామి గాలిగోపురం భద్రత ప్రశ్నార్థకంగా మారింది. సుమారు 500ఏళ్లకుపైగా చరిత్ర ఉన్న ఈ ఆలయ గోపురం ఆరేళ్ల క్రితం కూలిపోయింది. ఆ తర్వాత పునరుద్ధరించినా ఫలితం కనిపించడంలేదు. గాలి గోపురం భద్రత గాలిలో దీపంగా మారింది. అధికారుల అవినీతి, నాసిరకం పనుల వల్ల నెర్రెలు చీలి ఏ క్షణంలో కూలుతుందో తెలియని స్థితిలో ఉంది.
దీనికితోడు ఇటీవలే పిడుగు తాకిడికి గాలి గోపురం పైభాగం కొంతమేర దెబ్బతిన్నది. క్రీ.శ.1490 నుంచి 1520 సంవత్సరాల మధ్య కాలంలో పెమ్మసాని తిమ్మనాయకుడు ఈ గుడిని నిర్మించినట్లు చరిత్ర చెబుతోంది. ఆలయంలో శిల్పకళా శోభితమైన మండపాలు, మహాద్వార గోపురాలు నిర్మించారు. ఘనద్వారం, గాలి గోపురాలు తూర్పు దిశలో ఉన్నాయి. వాటి ముందు ఊయల మండపం, ఎత్తయిన దీపస్తంభాలున్నాయి. ఏక శిలా రథం కూడా ఉంది. దానిలోని రంధ్రాల నుంచి ఏడాదికి రెండుసార్లు సూర్యకిరణాలు స్వామి వారి పాదాలపై ప్రసరించడం ఇక్కడి విశిష్టత.
* ఉరవకొండ పరిధిలోని పెన్నోబిళంలో లక్ష్మీనరసింహస్వామి ఆలయం కూడా రాయలకాలం నాటిదే. దీని ఉత్తర, దక్షిణ గోపురాలు శిథిలావస్థకు చేరుకున్నాయి. గతంలో వీటికి మరమ్మతులు చేసిన్పటికీ ప్రయోజనం లేకపోయింది. రాజగోపురాలు కూలిపోయే స్థితిలో ఉన్నాయి. అధికారుల నిర్లక్ష్యమే ఈ దుస్థితికి కారణమంటూ భక్తులు మండిపడుతున్నారు.
* రాయదుర్గం పట్టణ సమీపంలోని కొండ మీద మాదవరాయస్వామి పురాతన దేవాలయం ఉంది. ఇక్కడ గుప్తనిధుల కోసం ఎక్కడ పడితే అక్కడ తవ్వకాలు జరిగాయి. దీంతో ఆలయం శిథిలావస్థకు చేరుకుంది. భక్తులు అక్కడకు వెళ్లేందుకే భయపడుతున్నారు.
* రాయలు విడిది చేసిన ప్రాంతం పెనుకొండ. ఇక్కడి ఆర్డీఓ కార్యాలయ ఆవరణలోని రాయల కాలంనాటి దీప స్తంభం ధ్వంసమైంది. ఇప్పటివరకు ఎలాంటి మరమ్మతులకు నోచుకోలేదు. గత ఏడాది గగనమహల్‌తోపాటు మరికొన్ని కట్టడాలకు తాత్కాలిక మరమ్మతులు చేసి వదిలేశారు.
*బత్తలపల్లి మండలం దంపెట్ల గ్రామంలోని చెన్నకేశవస్వామి ఆలయం పూర్తిగా శిథిలావస్థకు చేరుకుంది. గుప్తనిధుల కోసం విగ్రహాలను పెకిలించారు. ఆలయమంతా గుంతలతో నిండిపోయింది.
* కదిరి లక్ష్మీనరసింహస్వామి ఆలయ తూర్పు రాజగోపురం నెర్రెలు చీలింది. అయినా అధికారుల్లో చలనం లేదు. మరోవైపు పడమర, ఉత్తర రాజగోపురాలపై మొక్కలు పెరుగుతున్నాయి. అధికారులు కనీసం వాటిని తొలగించే ప్రయత్నం కూడా చేయడంలేదు

No comments:
Post a Comment