Wednesday, 19 October 2011

తెలంగాణ బస్సులకు మంగళహారతులు పట్టి ఘనంగా స్వాగతం పలికారు

                           
తిరుపతి ఆర్టీసీ బస్టాండుకు వచ్చిన తెలంగాణ బస్సులకు సమైక్యాంధ్ర పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో మంగళహారతులు పట్టి ఘనంగా స్వాగతం పలికారు. మంగళవారం శాప్స్ ఆధ్వర్యంలో తిరుపతి ఆర్టీసీ బస్టాండులో తెలంగాణ నుండి వచ్చిన బస్సులను శుభ్రం చేసి, పూజలు నిర్వహించి , ఆ బస్సుల డ్రైవర్లకు పూలదండలు వేసి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా శాప్స్ అధ్యక్ష, కార్యదర్శులు డాక్టర్ కోడూరు బాలసుబ్రహ్మణ్యం, రాజారెడ్డి మాట్లాడుతూ సకల జనుల సమ్మె పేరుతో తెలంగాణ వాదులు రైల్‌రోకో ఆర్టీసీలో సమ్మె, వివిధ ప్రభుత్వ రంగ సంస్థల్లో సమ్మె చేశారన్నారు. కోస్తాంధ్ర నుండి హైదరాబాదుకు వెళ్లేబస్సులపైన కోదాడ వద్ద , రాయలసీమ వైపు నుండి వెళ్లే బస్సులపై మహబూబ్‌నగర్ వద్ద నిలిపి రాళ్లతో దాడిచేస్తే అందులో ప్రయాణికులను భీతావహుల్ని చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. సకల జనుల సమ్మె వలన సాధించింది శూన్యమని వారు అన్నారు. సమ్మె వల్ల ప్రభుత్వ ఆస్తులకు చాలా నష్టం వాటిల్లిందన్నారు. చివరికి తెలంగాణలోనే తిరుగుబాటు రావడంతో విధిలేని పరిస్థితుల్లో సమ్మెను విరమించుకున్నారన్నారు. శాప్స్ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు సింధుజ మాట్లాడుతూ సకల జనుల సమ్మె సందర్భంగా దసరా పండుగను తెలంగాణలో బహిష్కరిస్తే ఆ తెలంగాణ బస్సులకు రాయలసీమ, ఆంధ్రలకు చెందిన బస్సుల డ్రైవర్లు, కండక్టర్లతో తాము దసరా జరుపుకున్నామన్నారు

No comments:

Post a Comment