Wednesday, 19 October 2011

ఈ నెల 21న ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి రాయదుర్గం పర్యటన

రూ. 1050 కోట్లతో రాయదు ర్గం- టుంకూరు రైల్వేలైన్ నిర్మాణం ప నులకు రాష్ట్ర ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి ఈ నెల 21న శంకుస్థాపన చేస్తున్నట్లు రెవెన్యూ శాఖ మంత్రి రఘువీరారెడ్డి తెలిపారు. సీఎం పర్యటన ఏర్పాట్లను పరిశీలించేందుకు వ చ్చిన ఆయన పట్టణంలోని అర్అండ్ బీ అతిథిగృహంలో మంగళవారం వి లేఖరుల సమావేశంలో మాట్లాడారు. ఈ నెల 21న ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి రాయదుర్గం పర్యటన ఖ రారు అయినట్లు ఆయన ప్రకటించా రు. ముఖ్యమంత్రితో పాటు, కేంద్ర రైల్వే క్యాబినెట్ మంత్రి దినేష్ త్రివేది, సహాయ మంత్రి మునియప్ప వస్తున్నట్లు తెలిపారు.

ప్రథమంగా రాయదుర్గం మండలంలోని బీఎన్‌హళ్ళికి రాష్ట్ర ముఖ్యమంత్రి మంగళవారం 9 గంటలకల్లా చేరుకుని ఇందిర జలప్రభ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారని తెలిపా రు. సభావేదిక వద్ద ఏర్పాటు చేసిన రూ. 1050 కోట్ల రాయదుర్గం- టుం కూరు రైల్వేలైన్ నిర్మాణం పనులకు, రూ.13 కోట్లతో ఓబుళాపురంలో ని ర్మించనున్న 132 కేవీ విద్యుత్ సబ్‌స్టేషన్, డ్వామా భవనానికి, రూ.15 కోట్లతో బీటీపీ ఆధునీకరణ పనులకు శంకుస్థాపన చేస్తారన్నారు.

No comments:

Post a Comment