ఆంధ్రలో చిచ్చు పెట్టేందుకు తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె.
చంద్రశేఖర రావు ప్రయత్నిస్తున్నారని మంత్రి టిజి వెంకటేష్ విమర్శించారు.
ఆంధ్రలో చిచ్చు పెట్టేందుకే ఉప ఎన్నిక జరుగుతున్న కోవూరు శానససభా
నియోజకవర్గంలో ప్రచారం సాగిస్తానని కెసిఆర్ చెబుతున్నారని ఆయన శనివారం
మీడియా ప్రతినిధులతో అన్నారు. కోవూరులో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ
అభ్యర్థి నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డికి ప్రజలు ఓటేస్తే రాష్ట్ర
విభజనకు ఓటేసినట్లేనని ఆయన అన్నారు. వైయస్ జగన్ వర్గానికి చెందిన 17 మంది
శానససభ్యులపై స్పీకర్ వేటు వేస్తూ సరైన నిర్ణయమే తీసుకున్నారని, వేటు
బాధాకరమే అయినప్పటికీ అది సరైన నిర్ణయమని ఆయన అన్నారు. వైయస్సార్ కాంగ్రెసు
వైపు వెళ్లిన నాయకులు తిరిగి కాంగ్రెసులోకి వస్తారని ఆయన అభిప్రాయపడ్డారు.
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ త్వరలో కాంగ్రెసులో విలీనమవుతుందని ఆయన
అన్నారు.

No comments:
Post a Comment