Saturday, 3 March 2012

పుట్టపర్తిలో4 కోట్లతో మ్యూజియం

ప్రపంచంలోని ప్రతి నిరుపేద భక్తునికి భగవంతుని సందేశం వినిపించడం ధ్యానం యోగా ద్వారా మానసిక ప్రశాంతతను కలుగ జేయడమే లక్ష్యంగా పని చేస్తున్నామని, బ్రహ్మ కుమారీ ఈశ్వరీయ విశ్వవిద్యాలయ డైరక్టర్ రతన్‌జీ తెలిపారు.  గోకులంలో గల వారి కార్యాలంలో ఆయన విలేఖర్లతో మాట్లాడుతూ ప్రపంచ వ్యాప్తంగా 130 దేశాల్లో బ్రహ్మ కుమారీ ఈశ్వరీయ విశ్వవిద్యాలయాలున్నా, విదేశాలకు లండన్ ప్రధాన కేంద్రంగా భారత్‌లో వౌంట్ అబు కేంద్రంగా పని చేస్తున్నాయన్నారు. ప్రపంచ వ్యాప్తంగా 8500 సేవా కేంద్రాలు వున్నాయని, భారతదేశ కాలమాన ప్రకారం ఉదయం 4 గంటల నుండి 5 గంటల వరకు బ్రహ్మ ముహుర్తంలో రోజు 10 లక్షల మంది ధ్యానం చేస్తారని, ప్రతి మూడవ ఆదివారం సాయంత్రం 6:30 గంటల నుండి 7:30 గంటల మధ్య విశ్వశాంతి కోసం ప్రపంచ వ్యాప్తంగా ధ్యానం నిర్వహిస్తామన్నారు. ప్రపంచ వ్యాప్తంగా శాంతినికి కాంక్షించే సంస్థగా ఐక్యరాజ్య సమితి తల ట్రస్టుకు ఐదు శాంతిదూత అవార్డులను ప్రధానం చేసిందన్నారు. నైతిక విలువలతో కూడిన బోధనలు, మారసిక ప్రశాంతత చేకూరడం, దుర అలవాట్లకు గురైన వారిని సన్మార్గంలో మార్చడం యోగా ద్వారా సాధ్యమన్నారు. పుట్టపర్తిలో ఐదు ఎకరాల్లో 81 అడుగుల ఎత్తుతో లింగాకృతిలో సుమారు 5 కోట్ల వ్యయంతో మ్యూజియంను నిర్మించడానికి కృషి చేస్తామన్నారు. ఇందులో ఆడిటోరియం, ధ్యాన మందిరం వసతి గృహాలు వుంటాయన్నారు. ప్రతి మతం వారు భగవంతుడు ఒక్కడే అని నమ్ముతున్నారని, అయితే ఆ భగవంతుడు ఎవరనేది తెలుసుకోలేక పోతున్నారని, రాజయోగం ద్వారా పరమాత్తుని గురించి తెలుసుకోవచ్చన్నారు.

No comments:

Post a Comment