Saturday, 25 February 2012

జట్టులో విభేదాలు లేవు...ధోని

బీసీసీఐ మరోవైపు జట్టుకు క్లాస్ ..!
భారత జట్టులో అభిప్రాయ భేధాలు కాని, కమ్యూనికేషన్ గ్యాప్ లేదని కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని స్పష్టం చేశారు. ఇలాంటి వార్తలు డ్రెస్సింగ్ రూమ్‌లో ఆటగాళ్లకు ఇబ్బందిగా మారుతాయన్నారు. సెహ్వాగ్‌తో విభేధాలున్నాయన్న వార్తల్ని ధోని ఖండించారు. డ్రెస్సింగ్ రూమ్‌లో ఆటగాళ్ల మధ్య సంబంధాలు బాగానే ఉన్నాయన్నారు. ముక్కోణపు సిరీస్‌లో భాగంగా మంగళవారం జరుగనున్న కీలక మ్యాచ్‌లో ప్రయోగాలకు చోటివ్వకుండా.. ముగ్గురు ఓపెనర్లతో బరిలోకి దిగుతామని ధోని వెల్లడించారు.వ్యక్తిగత విభేదాలతో ఎడమొహం పెడమొహంగా ఉంటున్న టీ మిండియా సారథి ధోనీ, వైస్ కెప్టెన్ సెహ్వాగ్ మధ్య ఎలాంటి గొడవలూ లేవని చెబుతున్న బీసీసీఐ మరోవైపు జట్టుకు క్లాస్ పీకుతోంది. గొడవలు మాని.. ఆటపై దృష్టిపెట్టండంటూ ఆటగాళ్లకు చురకలంటించినట్టు సమాచారం. వారిని అసలు మాట్లాడొద్దని (మీడియాతో) సూచించాం. మిగిలిన రెండు వన్డేలపై దృష్టిపెట్టాలని కోరాం. భారత జట్టుకు బీసీసీఐ నుంచి ఓ మెసేజ్ కూడా వచ్చింది. గొడవలన్నీ పక్కనబెట్టి మెరుగైన ప్రదర్శన చేయండని ధోనీ, వీరూలకు ప్రత్యేకంగా చెప్పామ'ని బోర్డు అధికారి ఒకరు పేర్కొన్నాడు.

No comments:

Post a Comment