తెలుగుదేశం పార్టీ నేత పయ్యావుల కేశవ్ తిరుపతి శాసనసభ్యుడు చిరంజీవిపై
మంగళవారం చలోక్తి విసిరారు. స్పీకర్ నాదెండ్ల మనోహర్ ఉదయం శాసనసభను
బుధవారానికి వాయిదా వేశారు. అనంతరం సభ్యులంతా బయటకు వచ్చారు. ఈ సమయంలో
అసెంబ్లీ ప్రాంగణంలో పయ్యావులకు చిరంజీవి కనిపించారు. ఆయనతో పిచ్చాపాటిగా
మాట్లాడారు. అసెంబ్లీలో ఈ రోజు మీరే స్పెషల్ అంటూ ఆయనతో అన్నారు. దానికి
చిరంజీవి అదేలా అని ప్రశ్నించారు. ఈ రోజు వాలెంటైన్స్ డే కదా మీరే హాట్
ఫేవరెట్ అని చెబుతూ ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ,
ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఇద్దరూ ఐ లవ్యూ అంటూ మీ వెంట పడుతున్నారు
కదా అని అన్నారు. దానికి చిరంజీవి నవ్వుకుంటూ అక్కడి నుండి వెళ్లి పోయారు.కాగా
అంతకుముందు మంగళవారం సమావేశమైన అసెంబ్లీ మూడుసార్లు వాయిదా పడింది.
విపక్షాలు ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని స్పీకర్ నాదెండ్ల మనోహర్
తిరస్కరించారు. దీంతో టిఆర్ఎస్, బిజెపి, తెలంగాణ తెలుగుదేశం నేతలు తెలంగాణ
కోసం, సీమాంధ్ర టిడిపి నేతలు మద్యంపై చర్చ జరగాలంటూ పట్టుబట్టారు. దీంతో
స్పీకర్ సభను అరగంట వాయిదా వేశారు. ఆ తర్వాత ఇదే సీన్ రిపీట్ కావడంతో మరో
పదిహేను నిమిషాలు వాయిదా వేశారు. మూడోసారి స్పీకర్ సభను బుధవారానికి వాయిదా
వేశారు.
No comments:
Post a Comment