Saturday, 11 February 2012

చంద్రబాబు పై సెటైర్లు... ఎమ్మెల్యే చిరంజీవి

బైక్‌రైస్ చేసినంత మాత్రాన యువత వారి వెంట వెళ్లరని, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుపై ఎమ్మెల్యే చిరంజీవి పరోక్ష విమర్శలు చేశారు.చంద్రబాబు బైక్ ర్యాలీలపై ఆయన విసుర్లు విసిరారు. చంద్రబాబు, తెలుగుదేశం పార్టీ పేర్లు ప్రస్తావించకుండా ఆయన వ్యాఖ్యలు చేశారు. బైక్ ర్యాలీలు చేసినంత మాత్రాన యువకులు విశ్వసించబోరని, వారికి ఏమైనా చేస్తేనే వారు విశ్వసిస్తారని ఆయన అన్నారు.  గుంటూరులో 2009లో యువగర్జన సదస్సు నిర్వహించారని, యువతకు 40 శాతం సీట్లు ఇస్తామని హామీ ఇచ్చారని, అలా ఇవ్వలేదని ఆయన అన్నారు. ఇప్పుడు 40 శాతం సీట్లు యవతకు ఇస్తామంటున్నారని, అంత మాత్రాన యువత నమ్మబోదని ఆయన చంద్రబాబును ఉద్దేశించి అన్నారు. రాష్ట్రంలో కొందరి మాటలు నమ్మే స్థితిలో యువత లేదని ఆయన అన్నారు. తనతో పాటు తన అభిమానులందరూ కాంగ్రెసు పార్టీలోకి రావడం సంతోషకరంగా ఉందని ఆయన అన్నారు.శనివారం ఉదయం మీడియాతో మాట్లాడుతూ కొందరి మాటలు నమ్మే స్థితిలో యువత లేదని ఆయన అన్నారు. తన తో అనుబంధం ఉన్న అభిమానులందరూ నేడు కాంగ్రెస్ వైపు రావడం సంతోషకరంగా ఉందని చిరంజీవి పేర్కొన్నారు.

1 comment:

  1. పార్టీలు గెంతిన నేతలు కోకొల్లలే
    పార్టీల ను నమ్మిన నేతలు కొందరే

    పార్టీనే తెగనమ్మిన నవనేత ఒక్కరే
    పార్టు లయ్యెను రాజకీయము అక్కటా

    హర్ట్ ఆయెను సగటు జీవి
    స్మార్ట్ నీవు ఓ చిరుజీవీ

    ReplyDelete