చిత్తూరు జిల్లా పుత్తూరులో రోడ్డు నిర్వాసితుల పోరుబాటకు వైఎస్‌ఆర్
కాంగ్రెస్ మద్ధతు పలికింది. నివాస ప్రాంతాలను బలవంతంగా ఖాళీ చేయించిన
ప్రభుత్వం, వారికి పరిహారం చెల్లించడంలో జాప్యం చేస్తోందంటూ ఆందోళన
చేపట్టింది. ఈ ఆందోళన కార్యక్రమానికి భారీగా కార్యకర్తలు, అభిమానులు తరలి వచ్చారు. ఈ సందర్భంగా రోజా మాట్లాడారు.రైతులను
పట్టించుకోనందుకు గతంలో తెలుగుదేశం పార్టీకి ప్రజలు బుద్ది చెప్పారని
ఇప్పుడు కాంగ్రెసుకు బుద్ది చెప్పడానికి సిద్ధంగా ఉన్నారన్నారు. రైతులను
పట్టించుకోకుంటే టిడిపికి పట్టిన గతే కాంగ్రెసుకు పడుతుందన్నారు. అధికార
పార్టీని రైతులు తరిమి తరమి కొడతారని హెచ్చరించారు. దివంగత వైయస్
రాజశేఖరరెడ్డి తర్వాత రాష్ట్రంలో రైతులను పట్టించుకునే వారు
కరువయ్యారన్నారు. ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకు వచ్చి జగన్ రైతాంగ సమస్యలను
పరిష్కరిస్తారని అన్నారు. పక్క రాష్ట్రంలో రైతులకు మద్దతు ధరతో పాటు బోనస్
కూడా ఇస్తున్నారని కానీ రాష్ట్రంలో మాత్రం మద్దతు ధర కూడా ఇవ్వడం లేదని
ఆరోపించారు.వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు రోజా
బాధితులతో కలిసి శనివారం పుత్తూరు వద్ద జాతీయ రహదారిపై బైఠాయించి
రాస్తారోకో చేపట్టారు. దీంతో చెన్నై, రేణిగుంట జాతీయ రహదారిలో దాదాపు
నాలుగు కిలోమీటర్ల మేర వాహన రాకపోకలు స్తంభించాయి. బాధితులకు న్యాయం జరిగే
వరకూ వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తూనే ఉంటుందని రోజా అన్నారు.

No comments:
Post a Comment