తమ సమస్యల పరిష్కారం కోసం జూనియర్ వైద్యలు అత్యవసర సేవలు నిలిపివేసిన
నేపథ్యంలో తిరుపతిలోని ప్రసూతి ఆస్పత్రిలో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి
శనివారం ఉదయం ఆకస్మి తనిఖీలు నిర్వహించారు. వైద్య సేవలు ఎలా అందుతున్నాయో
రోగులను అడిగి తెలుసుకున్నారు.150 పడకలతో ఉన్న ఆస్పత్రిని 350
పడకల ఆస్పత్రిగా మారుస్తామని హామీ ఇచ్చారు. ఓపీ బ్లాక్ ఏర్పాటు చేస్తామని,
అనెస్తీషియా, డాక్టర్ల యూనిట్లు పెంచాతామన్నారు.ఈ ఏడాది డిసెంబర్ వరకు మహిళలకు పావలా వడ్డీ కోసం కొత్త కార్యక్రమాలను
చేపట్టనున్నట్లు ముఖ్యమంత్రి కిరణకుమార్‌రెడ్డి తెలిపారు. ప్రతి
మండలాల్లోనూ స్త్రీలకోసం రూ. 25 లక్షతో శ్రీశక్తి భవన్‌ను
నిర్మించనున్నట్లు సీఎం హామీ ఇచ్చారు. దేశంలోనే 54 శాతంపైన ఉన్న 25
సంవత్సరాలోపు యువకులను అనేక ప్రయోజనాలు కల్పిస్తున్నామని తెలిపారు. 2012
డిసెంబర్ నెలాఖరులోనూ లక్షా పదహారు వేల ప్రభుత్వ ఉద్యోగాలు కల్పిస్తామని
ఆయన ప్రకటించారు.
జిల్లాలో ఒక్కరోజు పర్యటనకు వచ్చిన ముఖ్యమంత్రి శనివారం శ్రీకాళహిస్తిలోని
టూరిజం హోటల్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ
సభలో ఆయన మాట్లాడుతూ టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు అబద్దాలు చప్పడం
మానలేదని, ప్రపంచ బ్యాంకుకు జీతగాడిగా పనిచేసిన చంద్రబాబును ప్రజలు నమ్మరని
ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు. బాబు హయాంలో జిల్లాకు ఒక్క పరిశ్రమా
రాలేదని, స్వలాభం కోసం మదర్ డెయిరీని మూయించారని సీఎం ఆరోపించారు.
కాంగ్రెస్‌ను భూస్థాపితం చేస్తానని పేర్కొన్న జగన్, మాతృసంస్థను మోసం
చేశారని కిరణ్‌కుమార్‌రెడ్డి దుయ్యబట్టారు. అధికార దాహంతో జగన్ పార్టీని
వీడారని ధ్వజమెత్తారు. జగన్ వర్గం ఎమ్మెల్యేల విషయమై స్పీకర్ నాదెండ్ల
మనోహర్ త్వరలోనే నిర్ణయం తీసుకుంటారని అన్నారు. అలాగే కడప జిల్లాకు చెందిన
రాయచోటి, రైల్వే కోడూరు, రాజంపేట నియోజకవర్గాలనేతలతో సీఎం సమీక్షా సమావేశం
నిర్వహించారు. టీటీడీ ఆధ్వర్యంలో రోగులకు
మూడు పూటలా ఉచిత భోజనం అందజేస్తామని సీఎం ప్రకటించారు. సీఎంతో మంత్రులు
గల్లా అరుణకుమారి, రఘువీరా, ఎమ్మెల్యే చిరంజీవి, ఎంపీ చింతామోహన్ తదితరులు
ఉన్నారు.
No comments:
Post a Comment