Friday, 24 February 2012

మద్యం సిండికేట్లపై అసెంబ్లీలో ప్రభుత్వం ప్రకటన

శాసనసభ బడ్జెట్ సమావేశాల్లో శుక్రవారం మద్యం సిండికేట్ల వ్యవహారంపై ప్రభుత్వం ప్రకటన చేసింది. దీంతో అధికార, ప్రతిపక్షాల మధ్య వాదప్రతివాదనలు జరుగుతున్నాయి. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి తరఫున మంత్రి కన్నా లక్ష్మినారాయణ వివరణ ఇచ్చారు. ఇప్పటి వరకు ఎసిబి 350 సిండికేట్ల దుకాణాలపై మాత్రమే దాడులు జరిపిందన్నారు. 34 సిండికేట్లపై దాడులు జరిగాయని, ఎసిబి నిష్పక్షపాతంగా విచారణ చేస్తుందన్నారు. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డికి చిత్తశుద్ధి లేకపోతే రిమాండ్ రిపోర్టులు కోర్టులకు వెళ్లవని కన్నా పేర్కొన్నారు.మద్యం ముడుపుల అంశంపై శుక్రవారం ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు మధ్య వాడి వేడిగా వాగ్వాదం జరిగింది. బాబు ప్రసంగిస్తున్న సమయంలో మంత్రులు అడ్డు తగిలారు. మద్యం ముడుపులపై రాష్ట్రవ్యాప్తంగా చర్చ జరుగుతుందని, ప్రజల అనుమానాలు నివృత్తి చేయాలని చంద్రబాబు అన్నారు. ఎసిబి రిపోర్టులోని వాస్తవాలను సభ దృష్టికి తీసుకు రావాలని ఆయన అన్నారు. రూ.15వేల కోట్ల ముడుపులు అందాయన్నారు. మద్యం ముడుపులపై ప్రభుత్వానికి సిగ్గుంటే సమాధానం చెప్పాలి.. కానీ దాటవేత ధోరణి సరికాదన్నారు. ముడుపులతో సంబంధమున్న అధికారులు జైళ్లో ఉంటే నేతలు మాత్రం దర్జాగా బయట, సభలో ఉన్నారన్నారు. వాస్తవాలు ప్రభుత్వం తారుమారు చేసిందన్నారు. ఎసిబి 140 మంది ప్రజాప్రతినిధులపై ఆరోపణలు వచ్చాయన్నారు. నున్నా రమణ కాంగ్రెసు నేత అని, ఆయన మీ పార్టీ నేతలకు ప్రకటనలు కూడా ఇచ్చారన్నారు. రాంరెడ్డి అనుచరుడు అన్నారు. అందుకు రాంరెడ్డి వెంకట రెడ్డి స్పందిస్తూ తనను వివాదంలోకి లాగవద్దన్నారు. మా అమ్మ కర్మకు 75వేల మంది వచ్చారని అన్నారు. రమణతో తనకు సంబంధం లేదన్నారు. ఖమ్మం వస్తే అక్కడ నిజానిజాలు తెలుస్తాయన్నారు.

No comments:

Post a Comment