Friday, 24 February 2012

సచిన్‌కు ఎవరి సలహాలు అక్కర్లేదు...వెంగ్ సర్కార్

ఎప్పుడు రిటైర్ కావాలనే విషయమై సచిన్‌కు ఎవ రూ సలహాలు ఇవ్వనక్కర్లేదని మాజీ కెప్టెన్ వెంగ్‌సర్కార్ అన్నాడు. 39 ఏళ్ల వయస్సులో కూడా సచిన్ పూర్తి ఫిట్‌గా ఉన్నాడన్నాడు. ఒకవేళ సచిన్ రిటైరైనా..అతని స్థానాన్ని భర్తీచేసే ఆటగాడు లేనేలేడని వెంగీ చెప్పాడు. సచిన్ తక్షణమే వన్డేలనుంచి రిటైర్ కావాల్సిందిగా మరో మాజీ కెప్టెన్ కపిల్‌దేవ్ సూచించిన సంగతి తెలిసిందే. మాస్టర్ స్దానాన్ని భర్తీ చేయడం దాదాపు అసాధ్యమేనని వెంగ్ సర్కార్ తెలిపాడు. సచిన్‌కి ఎప్పుడు రిటైర్ కావాలో బాగా తెలుసని, ఇందులో ఎవరి సలహాలు అక్కర్లేదని అన్నారు. ఇటీవల కపిల్ దేవ్ మాట్లాడుతూ సచిన్ ప్రపంచకప్ తర్వాత రిటైర్ కావాల్సిందన్న విషయం తెలిసిందే. ముక్కోణపు టోర్నీల వరుస వైఫల్యాలు చవిచూస్తున్న సచిన్‌ వన్డేలకు రిటైర్మెంట్‌ ప్రకటించాలని కపిల్‌దేవ్‌ చేసిన సూచనను వెంగ్‌సర్కార్‌ తప్పు పట్టాడు. సచిన్‌ ఫిట్‌నెస్‌పై ఎవరు సందేహించాల్సిన అవసరం లేదన్నాడు. జట్టు మొత్తం వైఫల్యం చవిచూస్తున్నప్పుడూ ఒక్క సచిన్‌పైనే విమర్శలు చేయడం తగదన్నాడు. సచిన్‌పై అర్థంపర్థం లేని వ్యాఖ్యలు చేయడం మానుకోవాలని వెంగ్‌సర్కార్‌ పరోక్షంగా కపిల్‌ని ఉద్దేశించి అన్నాడు. 39 యేళ్ల వయసులోనూ సచిన్ చక్కని ఫిట్‌ నెస్‌తో... ఆటతీరుని ప్రదర్శిస్తున్న విషయాన్ని గుర్తించుకోవాలని అన్నాడు. పైగా భారత బ్యాటింగ్‌ లైనప్‌ బలహీనంగా ఉందని, ప్రస్తుత పరిస్థితుల్లో సచిన్‌ వన్డేలకు రిటైర్‌మెంట్‌ ప్రకటిస్తే, ఆ స్థానాన్ని ఎవరూ భర్తీ చేయలేరని వెంగీ అన్నాడు. ప్రపంచ క్రికెట్‌కు దొరికిన గొప్ప ఆటగాళ్లలో సచిన్‌ ఒకడు. క్రికెట్ ఆట పట్ల సచిన్ అంకిత భావం, నిబద్దత.. ఆడిన ఆట భవిష్యత్ తరాలకు ఆదర్శమని వెంగ్ సర్కార్ కొనియాడారు.

4 comments:

  1. ౨౦౩౮వసంవత్సరంలోకూడా సచిన్ ఆడుతూనే ఉంటాడు.
    ఎవరికైనా అభ్యంతరమా?
    ఆ తరువాతకూడా సచిన్ నాన్-ప్లేయింగ్ కెప్టెన్ హోదాలో ౨౦౭౮వరకు ఆడుతూనే ఉంటాడు.
    ఎవరికైనా అభ్యంతరమా?
    సచిన్ ఆట్ సచిన్ ఇష్టం.
    మిగతా పది స్థానాలకు మీకు తోచిన వాళ్ళను యెంపిక చేసుకునే అవకాశం ఉందిగా? ఇంక యేమిటి గొడవ?

    ReplyDelete
  2. సచిన్ గురించి మాట్లాడే అర్హత ఎవరికీ లేదు అని నా అభిప్రాయం.. ప్రపంచ క్రికెట్ నే పిక్ష్ఇంగ్ కుదిపేస్తున్నసమయం లో ఆణిముత్యంలా ఆ కుంబకోణంలో ఎక్కడ సచిన్ పేరు వినపడలేదు.. ప్రపంచకప్ జరుగుతున్నప్పుడు తండ్రి చనిపోతే ముడోరోజేనే టీం లో వచ్చి జాయిన్ అయినాడు అతనికి ఆట పట్ల ఉన్న అంకితబావం అలాంటిది.. అతనికి తెలుసు ఎంతవరకు ఆడగలడో అప్పటిదాకా ఆడుతాడు ఎవరు సలహా ఇవ్వవలసిన పని లేదు.. ఇంతకూ ముందు గంగూలి ఇలానే మాట్లాడాడు.. కొన్నిరోజులకు కనుమరుగు అయిపోయాడు.. తోరలో వీళ్ళ పరిస్థితి అంటే.. తోరలో మనమే చూస్తాం.. గెలిస్తే నావల్ల గెలిసింది.. వోడిపోతే మీవల్ల వోడిపోయింది.. అంటే ఎలా.. నాలుగు టెస్ట్ ఆడేసరికి టెస్ట్ లో ఆడలేక రిటైర్ కోసం ఆలోచన చేసేవారు సీనియర్స్ గురించి మాట్లాడుతారా? సచిన్ క్రీజ్ లో ఉన్న సమయం వీళ్ళ క్రికెట్ లైఫ్ లేదు ప్రతివాడు మాట్లాడేవాడే.. నాలాగా.. హ హ హ

    ReplyDelete
  3. అవునండీ.
    సచిన్ గురించి మాట్లాడే అర్హత యెవరికీ లేదు.
    క్రికెట్ చూసే అర్హత కూడా లేకుండా పోతుందేమో త్వరలోనే.
    అప్పుడు యెంచక్కా బోలెడు సమయం ఆదా అవుతుంది.
    సచిన్ ఆడుకోనివ్వండి మానుకోనివ్వండి మనకేం.
    ఐ.సి.సి వాళ్ళు రూల్స్ కాస్త మార్చితే వికెట్ల లెక్కే గాని ప్రతి వికెట్‍కూ ఒక కొత్త ఆటగాడు రానక్కరలేదూ అవుటయిన వాడయినా సరే అని సవరిస్తే, హాయిగా ఒక వైపున సచిన్ ఇన్నింగ్స్ మొదటినుండి చివరిదాకా కనువిందు చేస్తాడు అందరికీ. అది నచ్చని వాళ్ళు క్రికెట్ చూడటం మానుకోవచ్చు.

    ReplyDelete
  4. సర్ మీరు అల అనేశారు ఏమిటి అండి అవుట్ అని నన్ను మరి బాధ పెట్టింది అండి.. అక్కడ అందరు ఆడి సచిన్ పెల్ అయితే అనాలి అంత పెల్ అయినారు అండి ప్రతి ఆట సచిన్ నే ఆడాలి అనటం తప్పుకదా.. నేను సచిన్ పెద్ద పాన్ అండి.. ఇండియా లో తోబ్బై శాతం సచిన్ కోసమే ఆట చూస్తారు అండి అందులో నేను ఒకడిని.. ఈమధ్య ఇతర దేశాలలో కూడా సచిన్ లేకపోతె ఇ ర్ పి రేటింగ్స్ రావు అన్నారు అంటే అర్ధం చేసుకోండి..

    ReplyDelete