కర్నూలు
ఘంటసాలకు ఎవరూ సాటిరారని మంత్రి టీజీ వెంకటేష్ అన్నారు. శనివారం రాత్రి
కలెక్టర్‌లోని సునయన ఆ డిటోరియంలో ఉపాధ్యాయుడు చం ద్రకంటి మద్దయ్య
ఆధ్వర్యంలో డ్రీ మ్స్ ఇండియా సంస్థ ఘంటసాల వ ర్ధంతి కార్యక్రమాన్ని
నిర్వహించింది. ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి టీజీ వెంకటేష్ మాట్లాడుతూ
గాయకుడు ఘంటసాల వెంకటేశ్వర రావు స్వాతంత్య్ర సమరయోధుడని కొనియాడారు. ఆయన
1943 ప్రాంతం లో ఆలూరుకు వచ్చి తన దేశ భక్తిని చాటారని వివరించారు. పేద
కుటుంబంలో పుట్టిన ఘంటసాల తండ్రి ఆ శయం కోసం ఎంతగానో పరితపించారన్నారు.
మహానుభావుల వర్ధంతి స భలను నిర్వహించేందుకు తన వంతు సహాయం అందిస్తానన్నారు.
ఉపాధ్యాయుడైన చంద్రకంటి చేస్తున్న ప్రజా జాగృతి కార్యక్రమాలను ఆ యన
ప్రశంసించారు. ఘంటసాలకు సంబంధించి అయిదు వేల పాట కచేరిలు నిర్వహించిన డీఏ
మిత్ర, గా యని పద్మావతి, సుధారాణి, ఇబ్ర హీం తదితరులు తమ గీతాలతో ఆ హూతులను
అలరించారు. ప్రముఖ నాయకుడు లక్క సాగరం లక్ష్మీరెడ్డి కా ర్యక్రమానికి
హాజరై ఘంటసాల గు రించి మాట్లాడారు. అనంతరం కళాకారులను, కళా పోషకులను
జ్ఞాపికల తో సత్కరించారు. రాత్రి ఆరు గంటల నుంచి ప్రారంభమైన ఘంటసాల మధుర
గీతాలాపన అర్ధరాత్రి వరకు సాగింది.
ఘంటసాల విగ్రహావిష్కరణ : నగరంలోని చిల్డ్రన్స్ పార్కు దగ్గర ప్రముఖ సినీ
గాయకుడు ఘంటసాల వెంకటేశ్వరరావు విగ్రహాన్ని మంత్రి టీజీ వెంకటేష్
ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఘంటసాల భగద్గీతను పాడి
ప్రజలందరికీ బహుమతిగా ఇచ్చారని తెలిపారు.
No comments:
Post a Comment