
జగన్ మాట్లాడుతూ రాష్ట్రంలో రైతుల బాధలు చూస్తే గుండెలు పగులుతున్నాయని
ఆవేదన వ్యక్తం చేశారు. దివంగత నేత వైఎస్‌ఆర్ బతికి ఉంటే ఈ కష్టాలు ఉండేవి
కావన్నారు. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా రాష్ట్రంలో రైతులు క్రాప్ హాలిడే
ప్రకటించడం ప్రభుత్వ అసమర్థతకు నిదర్శనమని ధ్వజమెత్తారు. విద్యార్థులకు ఫీజ్ రీయింబర్స్‌మెంట్ అందించని రాష్ట్ర ప్రభుత్వ తీరుపై
మండిపడ్డారు. ప్రాణాపాయంలో ఉన్నవారిని రక్షించే నిమిత్తం ప్రవేశపెట్టిన 108
అంబులెన్సుల నిర్వహణ లోపానికి తోడు, పేదలకు ఉచిత వైద్యాన్ని కూడా సరిగా
ప్రభుత్వం అందించలేకపోతోందని ఆయన తీవ్రంగా విమర్శించారు. ప్రతి పేదవాడికీ
ఉచితంగా వైద్యం అందించాల్సిన ప్రభుత్వం ఆ పని చేయలేకపోతోందన్నారు. పేదవాడి
గుండె చప్పుడు వినేందుకు ప్రభుత్వానికి ఓపిక లేకుండా పోతోందన్నారు. రచ్చబండ
నిర్వహిస్తున్న ప్రభుత్వ అధికారులు.. అధికార పార్టీ ఎమ్మెల్యేలకు కొమ్ము
కాస్తున్నవారికే కార్డులు, పింఛన్లు అందజేస్తున్నారని విమర్శించారు. కనీసం
ప్రతిపక్షమైనా ప్రభుత్వ తీరుపై పోరు చేస్తుందనుకుంటే ప్రభుత్వంతో అది
కుమ్మక్కైన తీరును చూస్తున్నామన్నారు.
No comments:
Post a Comment