
పవన్ కళ్యాణ్ తాజా సినిమా ‘పంజా’ మరో రెండు రోజుల్లో డిసెంబర్ 9న విడుదలకు
సిద్ధం అవుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా గత మూడు రోజుల క్రితమే సెన్సార్
పూర్తి చేసుకున్నప్పటికీ సర్టిఫికెట్ మాత్రం ఈ రోజు రిలీజైంది. ఈ సినిమా
మంచి ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా ఉంటుందని అంతా భావించా....అందరినీ షాక్ కు
గురి చేస్తూ సెన్సార్ బోర్డు వారు ఈ సినిమాకు పెద్దలు మాత్రమే చూడతగినది
అంటూ..‘A’సర్టిఫికెట్ జారీ చేశారు. వాస్తవానికి సెన్సార్ బోర్డు వారు
కొన్ని కత్తెర్ల అనంతరం U/A సర్టిఫికెట్ ఇవ్వాలని చూశారు, అయితే పంజా దర్శక
నిర్మాతలు కత్తెర్లకు ఒప్పుకోక పోవడంతో సినిమాకు A సర్టిఫికెట్ జారీ
చేశారు.దీంతో ‘పంజా’ కేవలం పెద్దల వర్గానికి మాత్రమే పరిమితం
అయిందని, 18 సంవత్సరాల లోపు వయస్సు ఉన్న పవన్ అభిమానులకు ఈ సినిమా చూసే
హక్కు లేక పోవడం సర్వత్రా చర్చీనీయాంశం అయింది. సెన్సార్ బోర్డు వారు ఈ
సర్టిఫికెట్ జారీ చేశారంటే...మితిమీరిన హింస, శృతిమించిన శృంగార
సన్నివేశాలు గానీ ఈ సినిమాలో ఉన్నాయా? అనే అనుమానాలకు తావిచ్చినట్లయింది.అయినా
ఈ కాలంలో, ముఖ్యమంగా మన రాష్ట్రంలో A సర్టిఫికెట్ ను ఎవరు
పట్టించుకుంటున్నారు? మగధీర లాంటి సినిమాలకు A సర్టిఫికెట్
వచ్చినా....కుటుంబ సమేతంగా చూశారు. ఇప్పడు పంజా విషయంలో అదే జరుగుతుందని, A
సర్టిఫికెట్ ఉన్నా...పెద్దగా పోయేదేం లేదని పంజా దర్శక నిర్మాతల ఆలోచనగా
కనిపిస్తోంది.
No comments:
Post a Comment