Wednesday, 7 December 2011

సిఎం క్యాంపు కార్యాలయంలో వైయస్ వివేకాకు విచిత్ర అనుభవం

దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి సోదరుడు, మాజీ వ్యవసాయ శాఖ మంత్రి వైయస్ వివేకానంద రెడ్డికి బుధవారం ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి క్యాంపు కార్యాలయంలో విచిత్ర అనుభవం ఎదురైంది. వివేకానంద ఉదయం కిరణ్‌ను కలిసేందుకు సిఎం క్యాంపు కార్యాలయానికి వెళ్లారు. ఆయన లోపలకు వెళుతుండగా ఓ సెక్యూరిటీ గార్డు అతనిని ఆపేసి పూర్తిగా సోదాలు చేశారు. ఆ తర్వాతే అతనిని లోపలకు పంపారు.తన సోదరుడు వైయస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు క్యాంపు కార్యాలయంలో ఎలాంటి నిబంధనలు ఉండేవి కావు. వైయస్ సిఎంగా ఉన్నప్పుడు ఏమాత్రం సోదాలు చేయకుండా సెల్యూట్ కొట్టిన సెక్యూరిటీయే ఇప్పుడు ఆపి పూర్తిగా తనిఖీ చేయడం విశేషం.

No comments:

Post a Comment