Saturday, 24 December 2011

కడప జిల్లాలో రేప్ కేసులో,లాకప్ డెత్ ?

కడప జిల్లా కాజీపేటలో ఓ నిందితుడు మరణించాడు. అయితే, దాన్ని లాకప్ డెత్‌గా అనుమానిస్తున్నారు. గంగులయ్య అనే వ్యక్తి ఉరేసుకుని పోలీసు స్టేషనులో మరణించాడు. చెన్నూరుకు చెందిన గంగులయ్యను పోలీసులు ఓ ఆత్యాచారం కేసులో అరెస్టు చేశారు. గంగులయ్య చెన్నూరు వంతెనపై 13 ఏళ్ల బాలికపై అత్యాచారం చేశాడని ఆరోపణలు వచ్చాయి. దీంతో పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకుని స్టేషనులో బంధించారు. అతన్ని పోలీసులు చిత్రహింసలు పెట్టి చంపేశారని అతని బంధువులు ఆరోపిస్తున్నారు. గంగులయ్య బాత్రూమ్‌కు వెళ్లి తన లుంగీతో ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు చెబుతున్నారు. అయితే, గంగులయ్య బంధువులున పోలీసు స్టేషను ఎదుట ఆందోళనకు దిగారు. పోలీసులు కొట్టడం వల్లనే గంగులయ్య మరణించాడని అతని బంధువులు ఆరోపిస్తున్నారు. దీంతో అక్కడ తీవ్ర ఉద్రిక్తత నెలకొంది

No comments:

Post a Comment