అనంతపురం జిల్లా ఉప ఎన్నికల పోరుపై తెలుగుదేశం పార్టీ లో టెన్షన్!
ఉప ఎన్నికల అభ్యర్థుల ఎంపికలో అనంతపురం నియోజకవర్గంమే
తలనొప్పిగా ఉంది.
ఇక్కడ మున్సిపల్ మాజీ చైర్మన్ వైకుంఠం ప్రభాకర్‌చౌదరి, ఇన్‌చార్జి మ
హాలక్ష్మీ శ్రీనివాస్, రాజ్యసభ మాజీ స భ్యుడు కేఎం సైపుల్లా, మైనార్టీ నేత
న దీం ప్రధానంగా టికెట్ రేసులో ఉన్నా రు. దీంతో ఎవరికి అధినేత ఛాన్సు
ఇస్తారనే ఉత్కంఠత కొనసాగుతోంది. బుధవారం నియోజకవర్గ సమీక్షలో కూడా క లిసి
పనిచేద్దాం అంటూనే కొందరు తిరకాసు పెట్టారు. ప్రభాకర్‌చౌదరి టికెట్ ఎ వరికి
వచ్చినా మనస్ఫూర్తిగా గెలుపుకు పనిచేస్తానన్నారు. అయితే నాయకులు మారాలని
పరోక్షంగా సూచించారు. కే ఎం సైపుల్లా ఒకడుగు ముందుకేసి అభ్యర్థిని ముందే
ప్రకటించిన తర్వాతే జనచైతన్యయాత్రను మొదలు పెట్టాలని డి మాండ్ చేశారు.
మహాలక్ష్మీ శ్రీనివాస్ మాత్రం సమష్టిగా పనిచేసి పార్టీని బలో పేతం చేసి
అనంతలో పచ్చజెండా ఎగురవేద్దామని పిలుపునిచ్చారు. నాయకు లు, కార్యకర్తలు
ఒక్కటేనని ఆభావంతో నే ముందుకు సాగాలని మరోనేత నదీం సూచించారు. ఇలా టికెట్
రేసులో ఉన్న నాయకులు తమ మనసులోని మాటను బయటపెట్టారు. అయినా టికెట్టు రేసు
లో మాత్రం ఎవరి ప్రయత్నాలు వారు కొనసాగిస్తున్నారన్న ఊహగానాలున్నా యి.
ఇదిలా ఉంటే రాయద్గుం నియోజకవర్గం అభ్యర్థి ఎంపికపై సైలెంట్‌గా వ్యవహారాలు
కొనసాగుతున్నాయి. ఇటీవల పార్టీలోకి చేరిన దీపక్‌రెడ్డికి టికెట్ ఖాయమని
భావించారు. అయితే మెట్టు గోవిందరెడ్డి తన కుమారుడిని తెరపైకి తెచ్చా రు.
అంతలోనే మెట్టుతోపాటు ఇతర నేత లు బీసీ అభ్యర్థిని నిలబెట్టాలని అధినేతకు
సూచించినట్టు సమాచారం.కొందరైతే ఏకంగా మాజీ ఎంపీ కాల్వ శ్రీనివాసులను
నిలపాలని కోరగా కాల్వ
నిరాకరించినట్టు చర్చించుకుంటున్నారు. ఈ తతంగంలో కొందరు గుట్టుగా టికెట్టు
కోసం ప్రయత్నాలు చేస్తున్నారని తెలిసింది. ఉప ఎన్నికల అభ్యర్థుల ఎంపిక ఇలా
అనంతలో టెన్షన్ ఉంటే రాయదుర్గంలో సైలెంట్‌గా వ్యవహారాలు కొనసాగుతున్నాయి.
29న కొలిక్కి
ఇదిలా ఉంటే ఈనెల 29న రాజధానిలో జరిగే జిల్లా నేతల సమావేశంలో అభ్యర్థుల
ఎంపిక ఓకొలిక్కి వచ్చే అవకాశం ఉంది. ఆ రోజు అధినేత తమ అభిప్రాయాన్ని
గట్టిగానే చెప్పే అవకాశాలున్నాయని పార్టీ వర్గాలు చర్చించుకుంటున్నా రు. ఈ
ఉత్కంఠకు వారం ఆగుదాం.
No comments:
Post a Comment