తక్షణమే తమ 3జి రోమింగ్ ఒప్పందాలను
నిలిపివేయాలని సూచిస్తూ మూడు ప్రధాన టెలికాం సంస్థలు భారతి 

ఎయిర్‌టెల్, వొడాఫోన్, ఐడియాలకు టెలికాం శాఖ (డాట్) నోటీసులు జారీచేసింది. ఈకంపెనీలు కుదుర్చుకున్న 3జి రోమింగ్ ఒప్పందాలు చట్టవిరుద్ధం కావున దీనిపై 24 గంటల్లోగా తమ వివరణఇవ్వాల్సిందిగా టెలికాం ఆపరేటర్లను ఆదేశించింది. తమకు 3జి స్పెక్ట్రమ్ లభించని సర్కిళ్లలో 3జి రోమింగ్ సేవల కోసం పరస్పరఒప్పందాలు కుదుర్చుకున్న భారతి, వొడాఫోన్, ఐడియాలకు డాట్ ఈరోజు నోటీసులు జారీచేసింది. అలాగే రోమింగ్ సేవల నిలిపివేత విషయంలో శనివారం సాయంత్రం మూడు గంటలలోగా తమకు వివరణ ఇవ్వాలని టెలికాం శాఖ సూచించినట్లు ప్రభుత్వ వర్గాలు
తెలియజేశాయి. ఇదిలావుంటే 3జి రోమింగ్ ఒప్పందాలను తక్షణం నిలిపివేయాలని సూ చిస్తూ డాట్ త మకు నోటీసులు జారీ చేయడాన్ని తీవ్రంగా పరిగణించిన భారతి, వొడాఫోన్, ఐడియా సంస్థలు దీన్ని సవాలుచేస్తూ టెలికాం ట్రిబ్యునల్ టిడిశాట్‌కు ఫిర్యాదు చేశాయ.టెలికాం శాఖ నుంచి నోటీసులు అందుకున్న వెంటనే ముగ్గరు ఆపరేటర్లు టెలికాం ట్రి బ్యునల్‌కు వెళ్లారు. రోమింగ్ వివాదంపై టిడిశాట్ శనివారం ప్రత్యేక ంగా విచారణ జరపనుంది.
No comments:
Post a Comment