Friday, 2 December 2011

రైతు సమస్యలపై అనంతపురం జిల్లా బంద్, ర్యాలీలు సంపూర్ణం

వర్షాభావ పరిస్థిితుల కారణంగా పంట నష్టపోయిన రైతు లను ఆదుకోవాలని డిమాండు చేస్తూ శుక్రవారం విపక్షాలు అనంతపురం జిల్లా బంద్ నిర్వహించాయి. ఈ ఏడాది సకాలంలో వర్షాలు కురవకపోవడంతో రైతన్నలు పెద్ద ఎత్తున పంట నష్టపోయారు. దీంతో జిల్లాలోని అన్ని మండలాలనూ కరువు ప్రాంతాలుగా ప్రభుత్వం ప్రకటించినా ఎలాంటి సహాయ కార్యక్రమాలు నిర్వహించలేదు.ఈ పరిస్థితుల్లో జిల్లాకు ప్రత్యేక ప్యాకేజి ఇచ్చి ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ తెలుగుదేశం, సీపీఐ, సీపీఎంలతోపాటు ఇతర ప్రజా సంఘాలు శుక్రవారం జిల్లా బంద్ నిర్వహించాయి. అన్ని నియోజకవర్గాలు, మండల కేంద్రాల్లో ఆయా పార్టీల నేతలు ఉదయం నుంచే రోడ్లపైకి వచ్చి వాహనాల రాకపోకలను నిలిపివేయించారు.అనేకచోట్ల ర్యాలీలు నిర్వహించారు. దుకాణాలను బంద్ చేయించారు. ఉదయం 6 గంటలకే ఆర్టీసీ డిపో వద్దకు వెళ్లి బస్సులు కదల కుండా అడ్డుకున్నారు. బస్సులు డిపోలోనే నిలిచిపోవడంతో విధులకు వెళ్లే ఉద్యోగులు, ప్రయాణికులు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. బంద్ కారణంగా బ్యాంకుల కార్యకలాపాలు స్తంభించాయి.

No comments:

Post a Comment