‘శ్రీరామ రాజ్యం’ సినిమాపై పవన్ ప్రశంసల జల్లు
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ‘శ్రీరామ రాజ్యం’ సినిమాపై ప్రశంసల జల్లు కురిపించాడు. రామ్ చరణ్ ఎంగేజ్మెంట్ తర్వాత.... నిర్మాత యలమంచిలి సాయిబాబు పవన్ కల్యాణ్ కోసం‘ శ్రీరామ రాజ్యం’ స్పెషల్ షో వేయించారు. సినిమా చూసి అనంతరం పవన్ మీడియా ముందుకు వచ్చి శ్రీరామ రాజ్యం ఎంటైర్ టీంను పొగడ్తలతో ముంచెత్తారు. తాను పాత లవకుశ సినిమా చూడ లేదని, బాపు తీసిన ఈ సినిమా అద్భుతంగా ఉందన్నారు. బాలయ్య, నయనతార నటన సూపర్ అంటూ ఆకాశానికి ఎత్తేశాడు. లార్డ్ శ్రీ రాముడి పాత్రలో బాలకృష్ణ అద్భుతంగా నటించిందని, సీతాదేవి పాత్రలో నయనత తార జీవించిందని...నిజంగా వారి నటనకు హాట్సాఫ్ అంటూ పవన్ వ్యాఖ్యానించాడు. శ్రీరామ రాజ్యం సినిమా చూసిన తర్వాత బాపుపై గౌరవం మరింత పెరిగిందన్నారు. సినిమాకు సెట్స్ వేసిన ఆర్ట్ డైరెక్టర్ ను కూడా పవన్ ప్రశంసించాడు.
No comments:
Post a Comment